కరోనా వైరస్ కారణంగా మనం రోజు ఎంత నష్టపోతున్నామో తెలుసా…?

68

కరోనా వైరస్ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ ని అతి కఠిన౦గా అమలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ లాక్ డౌన్ అనేది దేశ ఆర్ధిక వ్యవస్థకు అతి పెద్ద దెబ్బ. జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒక్క రోజు లాక్ డౌన్ ప్రకటిస్తేనే భారీ నష్టాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు 21 రోజుల పాటు లాక్ డౌన్ అంటే…? ఆర్ధిక వ్యవస్థ చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి.

మన దేశంలో లాక్ డౌన్ కారణంగా వేల కోట్ల రూపాయలను ప్రతీ రోజు నష్టపోతున్నాం. మూడు వారాల లాక్‌డౌన్‌ వల్ల నష్టమే రూ.6.8 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు రోజుకు రూ.35,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది. లాక్ డౌన్ కారణంగా 80 శాతం ఉత్పత్తి నష్టం జరుగుతుందని కేర్‌ రేటింగ్స్‌ తాజా నివేదికలో పేర్కొంది.

నిత్యావసర సేవలు, వ్యవసాయ రంగంలో 20 శాతం ఉత్పత్తి మందగిస్తుందని అంచనా వేసారు. ఇప్పటికే డీమోనిటైజేషన్, జీఎస్‌టీ నిర్ణయాలతో చిన్న తరహా పరిశ్రమలు అన్నీ కుదేలు అయిపోగా మన దేశంలో ఇప్పుడు ఈ లాక్ డౌన్ కరోనా దెబ్బలు మాత్రం మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పేదలకు కనీసం రూపాయి కూడా దొరికే పరిస్థితి ఉండదు అని పలువురు అంటున్నారు.