ల్యాప్ లో వాట్సాప్ వీడియో కాల్ ఎలా మాట్లాడాలో తెలుసా? ప్రాసెస్ ఇదిగో..

-

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అందులో ముఖ్యంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ వెర్షన్‌ లలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ వీడియో, వాయిస్ కాల్‌లను అందిస్తుంది..వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ను ఒకేసారి 32 మందితో మాట్లాడోచ్చు. 8 మంది పార్టిసిపెంట్‌లతో గ్రూప్ వీడియో కాల్‌ లు వంటి మరిన్నింటిని అందిస్తుంది. ఆండ్రాయిడ్, iOS యూజర్లు రెగ్యులర్ గా సెల్యులార్ కాల్స్ కన్నా వాట్సాప్ కాల్‌లను ఎక్కువగా ఇష్టపడతారు..

వెబ్ యూజర్లకు తమ ల్యాప్ లో కాలింగ్ ఫీచర్ ను ఎలా వాడాలో తెలియక ఇబ్బంది పడతారు.ల్యాప్‌టాప్‌లలోనూ వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేసుకునే వీలుంది. WhatsApp వెబ్‌లో WhatsApp కాలింగ్ ఫీచర్‌ను ఎలా వాడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వాయిస్, వీడియో కాల్‌లు చేసేందుకు మీ Microsoft స్టోర్ లేదా Mac App Store నుంచి WhatsApp యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. అదనంగా, WhatsApp డెస్క్‌టాప్‌లో కాల్స్ చేసేందుకు లేదా స్వీకరించేందుకు మీరు మీ PCకి ఆడియో అవుట్‌పుట్ డివైజ్, మైక్రోఫోన్‌ను కనెక్ట్ చేయాలి..అలాగే ల్యాప్ కెమరాను యాక్సెస్ చేసేందుకు WhatsApp అనుమతిని పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాట్సాప్ వెబ్ గ్రూప్ కాల్‌లకు సపోర్ట్ చేయదు..యూజర్ కేవలం వ్యక్తిగత ఫోన్లను మాత్రమే ఉపయోగిస్తారు.

వీడియో కాల్ ను ఎలా చెయ్యాలి?

*. కాల్ చెయ్యాలనుకున్న చాట్‌ను ఓపెన్ చేయండి.
* ఆ తర్వాత వీడియో కాల్ లేదా వాయిస్ ఐకాన్‌పై Click చేయండి.
* మీరు మైక్రోఫోన్ క్లిక్ చేయడం ద్వారా కాల్ సమయంలో మీ మైక్రోఫోన్‌ను మ్యూట్ చేయవచ్చు లేదా అన్‌మ్యూట్ చేయవచ్చు లేదా కెమెరా ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీ కెమెరాను ఆఫ్ లేదా ఆన్ చేయవచ్చు..
ఇక వీడియో కాల్ ను మార్చమని రిక్వెస్ట్ చేయవచ్చు. రిసిప్ట్ యాక్సెప్ట్ క్లిక్ చేయడం ద్వారా కాలింగ్ మోడ్ స్విచ్‌ను అనుమతించవచ్చు. లేదంటే Switch to switch Call లేదా Cancel to decline చేయవచ్చు.. అలాగే కాల్ సమయంలో కెమెరా ఐకాన్‌పై మీ Mouseని ఉంచండి. కెమెరాపై క్లిక్ చేయండి. మీ కాంటాక్టు స్విచ్ రిక్వెస్ట్ అంగీకరిస్తే.. వాయిస్ కాల్ కాస్తా వీడియో కాల్‌కి కనెక్ట్ అవుతుంది.అంతే సులువుగా మీరు వీడియో కాల్ ను చేసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version