RRR -2 సినిమాపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ ధీరుడు గా పేరు పొందిన రాజమౌళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. రాజమౌళి కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు RRR సినిమాతో ఇంటర్నేషనల్ వైడుగా పేరు సంపాదించారు. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించిన ఈ చిత్రం హాలీవుడ్ డైరెక్టర్స్, క్రిటిక్స్ అందరూ కూడా రాజమౌళిని పొగిడేస్తున్నారు. ఒక్కసారిగా RRR సినిమా ఆస్కార్ అవార్డురేసులో నిలవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం కూడా అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు కేటగిరీలలో RRR సినిమా నామినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జాతీయ మీడియా తాజాగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొంతమంది సౌత్ డైరెక్షర్లను సైతం తీసుకువచ్చి ఒక ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో రాజమౌళి, లోకేష్ కనకరాజు, పృధ్విరాజ్ సుకుమారాన్, కమలహాసన్ వంటి వారితో చర్చలు జరిపించారు. ఇందులో లోకేష్ కనకరాజు మాట్లాడుతూ తన సినిమాల గురించి తెలియజేయడం జరిగింది. రాబోయే పదేళ్ల వరకు సరిపోయే అన్ని కథలు తన దగ్గర ఉన్నాయని తెలియజేశారు.

ఈ సమయంలోనే రాజమౌళి సైతం తన RRR చిత్రం సీక్వెల్ గురించి స్పందించారు. RRR సినిమా సీక్వెల్ గురించి మొదట ఆలోచన లేదు.అయితే ఐడియా బాగానే ఉంది కానీ ఇప్పుడు RRR సీక్వెల్ మీద ఒక గొప్ప ఆలోచన వచ్చింది.ప్రస్తుతం అయితే రైటింగ్ స్టేజ్లో ఉంది..ఇప్పుడు ఏమి చెప్పలేనని డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోయే సినిమా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలియజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version