యాంకర్ దేవి నాగవల్లి ఏడాది సంపాదన ఎంతో తెలుసా..?

-

దేవి నాగవల్లి యాంకర్ గా కంటే కాంట్రవర్సీ లతోనే ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకుంది. అంతే కాదు ఈమెతో ఏ స్టార్ హీరో అయినా సరే డిబేట్ పెట్టాడు అంటే కచ్చితంగా ఆ హీరో విజయం సాధించినట్టే.. నిజం చెప్పాలంటే ఒకానొక సందర్భంలో న్యూస్ రీడర్లకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు.. ఇక వారు చెప్పే వార్తలను వినే వారికి మాత్రమే వీరి గురించి తెలుస్తుంది. అలా ఎంతో మంది న్యూస్ రీడర్లు ఇప్పుడు సోషల్ మీడియా తో పాటూ ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ బాగా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి వారిలో టీవీ 9 లో సుదీర్ఘకాలంగా న్యూస్ రీడర్ గా వ్యవహరిస్తున్న దేవీ నాగవల్లి కూడా ఒకరు.

ఇక ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని కూడా సొంతం చేసుకుంది. నిజానికి బిగ్ బాస్ లో సుదీర్ఘకాలం ఉంటుందని అంతా భావించారు. కానీ సమయం కలిసి రాక బిగ్ బాస్ నుంచి చాలా తక్కువ సమయంలోనే బయటకు వచ్చింది. ఇక ఎప్పటిలాగే కార్యక్రమాలను నిర్వహించుకుంటూ బిగ్ బాస్ కి, ఆ తర్వాత టీవీ9 కి దూరంగా ఉండి , ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటుందని అంతా భావించారు. అంతేకాదు అప్పుడప్పుడు పెద్దపెద్ద చానెల్స్ నుంచి ఆఫర్లు వచ్చినా సరే టీవీ9 లోనే కొనసాగుతోంది.. ఇకపోతే సుదీర్ఘకాలంగా టీవీ9 లోనే కొనసాగుతున్న దేవీ నాగవల్లికి సాలరీ ఎంత ఉంటుంది అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.

ఇక నెల సంపాదన విషయానికొస్తే టీవీ9 నుంచి నెలకు ఈమెకు రూ.2 లక్షలు శాలరీ లభిస్తుంది. అంతేకాదు ప్రత్యేక కార్యక్రమాలు ఇతర సోషల్ మీడియా యాక్టివిటీస్ ద్వారా నెలకు ఇంకో 50 వేల రూపాయల వరకు సంపాదిస్తుందని సమాచారం. మొత్తానికైతే ఏడాదికి ఒక్క టీవీ 9 నుంచి 24 లక్షల రూపాయలను అందుకుంటుంది. స్పెషల్ బోనసులు కూడా ఉంటాయి.మొత్తంగా వీటిని కలుపుకొని రూ.25 లక్షలు టీవీ9 ద్వారా ఏడాది సంపాదనైతే.. ఇతర కార్యక్రమాల ద్వారా మరొక ఏడు లక్షల వరకు సంపాదిస్తుందని సమాచారం.. మొత్తంగా ఏడాదికి దేవి నాగవల్లి రూ.32 లక్షల వరకు సంపాదిస్తోందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news