వినాయక చవితి రోజు భక్తులు ఎవరైనా సరే.. తమ ఇష్టాలు, అభిరుచులు, తమ స్థోమతకు తగిన విధంగా రక రకాల గణేష్ విగ్రహాలను కొనుగోలు చేసి తెచ్చి ఇండ్లలో పెట్టుకుని ఆ రోజు పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే మనకు అనేక రకాల వినాయకుల విగ్రహాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే రక రకాల వినాయకుల విగ్రహాలు ఉన్నట్లుగానే వాటిలో ఒక్కో దానికీ ఒక్క ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలోనే
ఏ రకమైన విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది తెలుసుకుందాం
తొండం ఎడమ వైపుకు ఉన్నది
వినాయకుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం సాధిస్తారట.
తొండం కుడి వైపుకు ఉన్నది
వినాయకుడి తొండం కుడి వైపుకు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే అనుకున్న కోర్కెలు త్వరగా నెరవేరుతాయట. అయితే ఈ తరహా వినాయకుడి విగ్రహాలను పూజించేటప్పుడు నియమ నిబంధనలు, నిష్టను కచ్చితంగా పాటించాల్సిందేనట. లేదంటే ఫలితం దక్కకపోగా విపరీత పరిణామాలు ఏర్పడుతాయట.
తొండం మధ్యలో ఉంటే
వినాయకుడి తొండం మధ్యలో ఉండే విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజిస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుందట. ఇంట్లోని కుటుంబ సభ్యులకు శక్తి లభిస్తుందట.
తెలుపు రంగు
తెల్లని రంగులో ఉండే గణేషుని విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే ఇంట్లో శాంతి ఉంటుందట. సాధారణంగా ఇంట్లో, దంపతులు లేదా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉంటే తెల్లని వినాయకుడి విగ్రహాలను పూజిస్తే ఆ కలహాలు అన్నీ తొలగిపోయి అందరూ సఖ్యతగా ఉంటారట.
రావి ఆకు వినాయకుడు
రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఇంట్లో అందరికీ అన్నీ శుభాలే కలుగుతాయట.