ట్రెండింగ్: హీరోయిన్ రమ్యకృష్ణ హాట్ ఫోటోలు వైరల్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించింది..ఇక బాహుబలి సినిమాతో శివగామి పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించి రీఎంట్రీ ఇచ్చింది. ఇక దీంతో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు.. వాస్తవానికి రమ్యకృష్ణ ఒక తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇక ఎంతోమంది తెలుగులో అగ్ర హీరోల సరసన నటించింది. కొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటించి మెప్పించింది రమ్యకృష్ణ.రమ్యకృష్ణ హీరోయిన్గా నటిస్తున్న సమయంలోనే బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించింది. ఎటువంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి అద్భుతంగా నటించగల సత్తా రమ్యకృష్ణలో ఉందని చెప్పవచ్చు.రమ్యకృష్ణ వయసు మీద పడడంతో కొన్ని సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో కూడా నటించింది. తాజాగా రమ్యకృష్ణ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా మాస్ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రమ్యకృష్ణ. ఇక రమ్యకృష్ణ 1990 లో తన హాట్ అందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు.ఇక అప్పట్లో రమ్యకృష్ణకు సంబంధించి కొన్ని హాట్ ఫోటోలు ఇప్పుడు తాజాగా వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలలో రమ్యకృష్ణ కొన్ని బికినీ ఫోటోలు కూడా ధరించింది. ఇక అప్పట్లోనే తన అంద చందాలతో ఎంతోమంది కుర్రకారులను సైతం ఆకట్టుకునేలా కనిపిస్తోంది రమ్యకృష్ణ. ఇక రమ్యకృష్ణ ఈ ఫోటోలను చూసిన నేటిజెన్లు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి.. కానీ ఈ వార్తలపై రెండు రోజుల క్రితం డైరెక్టర్ కృష్ణవంశీ క్లారిటీ ఇవ్వడం జరిగింది.. దీంతో వీరి రూమర్స్ కు చెక్ పడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రమ్యకృష్ణ హాట్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version