ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? స్టార్ హీరోలతో నటించింది.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?

23805

తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన తర్వాత.. కొన్ని రోజులకే తమిళం, మలయాళం ఇండస్ట్రీకి వెళ్లిపోయింది షీలా. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ.. కొన్ని రోజులకే ఆమె అసలు వెండి తెర మీదనే కనిపించడం మానేసింది.

మీరు అదుర్స్ సినిమా చూశారా? పరుగు సినిమా.. మస్త్ సినిమా.. ఈ సినిమాల్లో ఏ ఒక్క సినిమా చూసినా.. మీకు ఈ హీరోయిన్ గుర్తుండే ఉంటుంది. అవును.. ఈ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది ఈవిడే. నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా.. స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరే తెచ్చుకుంది. కానీ.. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకీ ఈ హీరోయిన్ పేరన్నా గుర్తుందా మీకు. షీలా ఈమె పేరు.

Do you know this heroine sheela who worked with star heroes

తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన తర్వాత.. కొన్ని రోజులకే తమిళం, మలయాళం ఇండస్ట్రీకి వెళ్లిపోయింది షీలా. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ.. కొన్ని రోజులకే ఆమె అసలు వెండి తెర మీదనే కనిపించడం మానేసింది. దీంతో సినీ అభిమానులు కూడా ఆమెను మరిచిపోయారనే చెప్పుకోవాలి.

Do you know this heroine sheela who worked with star heroes

అయితే.. ఇటీవల సడెన్‌గా షీలా తిరుపతిలో దర్శనమిచ్చింది. అదుర్స్ సినిమాలో ఓ రేంజ్‌లో ఉన్న ఈ హీరోయిన్‌ను తిరుపతిలో చూసి షాక్ అయ్యారు. బక్కచిక్కిపోయి కనిపించింది షీలా. మీడియా వాళ్లు ఆమెను ప్రశ్నించగా.. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నానని.. అందుకే.. ఇలా బక్కచిక్కానంటూ సమాధానం చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయింది షీలా. ఏదిఏమైనా చాలారోజుల తర్వాత ఈవిధంగా షీలా కనిపిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు కదా. కనీసం ఇప్పుడైనా తన సినిమా కెరీర్ మళ్లీ కొనసాగాలని ఆశిద్దాం.

Do you know this heroine sheela who worked with star heroes

Do you know this heroine sheela who worked with star heroes