సినీ నటుడు పృథ్వీకి కీలక పదవి ఇవ్వనున్న సీఎం జగన్..?

502

వైకాపా నాయకుడు పృథ్వీకి సీఎం జగన్.. శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ పదవిని పృథ్వీకి ఇచ్చినట్లుగా త్వరలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేయనున్నట్లు తెలిసింది.

ప్రముఖ కమెడియన్, వైకాపా నేత.. పృథ్వీకి సీఎం జగన్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట. పృథ్వీ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం విదితమే. ఆయన ఎప్పటి నుంచో ఆ పార్టీకి పనిచేస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ పృథ్వీ వైకాపా తరఫున ప్రచారం చేశారు. అయితే ఇప్పుడాయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ కీలక పదవిని ఇవ్వనున్నట్లు తెలిసింది.

cm ys jagan might give this important post to cine Prudhvi Raj

వైకాపా నాయకుడు పృథ్వీకి సీఎం జగన్.. శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీని ఎంపిక చేస్తున్నట్లు ఇప్పటికే పృథ్వీకి సమాచారం ఇచ్చారని కూడా ప్రచారం సాగుతోంది. కాగా ఈ పదవిని పృథ్వీకి ఇచ్చినట్లుగా త్వరలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేయనున్నట్లు తెలిసింది.

కాగా ఇప్పటి వరకు ఎస్వీబీసీ భక్తి చానల్ చైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు పనిచేశారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యాక ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. కానీ వయోభారం వల్లే ఆ పదవి నుంచి తప్పుకుంటున్నానని ఆయన అప్పట్లో చెప్పారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. దీంతో ఆ పదవిని పృథ్వీకి ఇస్తారని ఇప్పుడు బాగా ప్రచారమవుతోంది. మరి అందరూ అనుకున్నట్లుగానే పృథ్వీకి జగన్ ఆ పదవిని ఇస్తారా..? లేదా..? వేచి చూస్తే తెలుస్తుంది..!