సాగర్ ఎప్పుడు నిండుతుందో తెలుసా?

-

నాగార్జునసాగర్.. నిండితే తెలంగాణ, ఏపీలకు బహుళ ప్రయోజనం. అయితే కొన్నేండ్లుగా ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయికి చేరట్లేదు. అయితే ప్రస్తుతం పైనున్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీ వర్షాలతో వరద బీభత్సం కన్పిస్తుంది. దీంతో పైనున్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండి సుమారు మూడులక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో జురాల నిండింది. అక్కడ నుంచి శ్రీశైలంకు సుమారు మూడులక్షల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. అక్కడ జలాశయం గత నాలుగురోజుల్లో కనిష్ట స్థాయి నుంచి గరిష్ఠస్థాయికి చేరువలో ఉంది. అక్కడి నుంచి సాగర్‌కు ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన చేసి కేవలం 46 వేల క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. అయితే మరో రెండుమూడు రోజులు శ్రీశైలానికి ఇదే ఫ్లో వస్తే పూర్తిస్థాయికి చేరుకుంటుంది. అదే ఫ్లో మరికొన్ని రోజులు కొనసాగితే ఆ వరదనీటిని దిగువ సాగర్‌కు వదులుతారు.

Do you know when Sagar dam will be filled

సాగర్ నిండటానికి..?

సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 130 టీఎంసీలు ఉన్నాయి. ఇంకా 182 టీఎంసీ లు కావాలి. దీని కావల్సిన వరద దాదాపు 21 లక్షల క్యూసెక్కులు. లక్ష క్యూసెక్కులకు దాదాపు 9 టీఎంసీలకు సమానం.. అంటే దీని ప్రకారం 1,04,166 సి/ఎస్ -9టీఎంసీలు. రోజుకు లక్ష క్యూసెక్కులు వస్తే 20 రోజుల్లో నిండుతుంది. ఒకవేళ 2 లక్షల క్యూసెక్కులు వస్తే 12 రోజులు పడుతుంది. అదండి సంగతీ వేచిచూద్దాం కృష్ణవేణమ్మ కరుణ కోసం బిరబిరా కృష్ణమ్మ తరలిరావాలని తెలుగు రాష్ట్ర ప్రజలను కరుణించాలని ఆశిద్దాం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version