వారు 35 ఏళ్లుగా పాములను ఇంట్లోనే పెంచుకుంటూ పూజిస్తున్నారు.. షాకింగ్ వీడియో..!

-

హిందువులు జరుపుకునే అనేక పండుగల్లో నాగపంచమి కూడా ఒకటి. ఆ రోజున మహిళలు పెద్ద ఎత్తున నాగ దేవాలయాలకు లేదా పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతలకు పాలు పోసి, గుడ్లు నైవేద్యంగా పెట్టి పూజిస్తారు.

హిందువులు జరుపుకునే అనేక పండుగల్లో నాగపంచమి కూడా ఒకటి. ఆ రోజున మహిళలు పెద్ద ఎత్తున నాగ దేవాలయాలకు లేదా పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతలకు పాలు పోసి, గుడ్లు నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. తమ కుటుంబాలను చల్లగా దీవించాలని వారు కోరుకుంటారు. ఇక ప్రతి ఏటా శ్రావణ మాసంలో అమావాస్య తరువాత నాగుల పంచమని జరుపుకుంటారు.

అయితే నాగుల పంచమి రోజు సాధారణంగా ఎవరైనా సరే.. దేవాలయాలకు వెళ్లి అక్కడ కొలువై ఉండే నాగదేవతలను కొలవడమో లేదా పుట్టల వద్దకు వెళ్లడమో చేస్తారు. కానీ కర్ణాటకలోని షిర్సి అనే ప్రాంతంలో ఉన్న ఓ గ్రామంలో మాత్రం ప్రతి ఇంట్లోనూ పాములు ఉంటాయి. వారు పాములను తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటుంటారు. వాటిని పెంచుకుంటారు. ప్రతి ఏటా నాగుల పంచమి రోజున ఆ పాములను ఆ గ్రామస్థులు పూజిస్తారు.

ఇక అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ హులేకల్ అనే వ్యక్తికి చెందిన కుటుంబ సభ్యులు కూడా గత 35 ఏళ్లుగా అలా పాములను పెంచుకుంటున్నారు. నాగుల పంచమి రోజున వాటిని పూజిస్తున్నారు. తాజాగా వారు తమ ఇంట్లో ఉన్న పాములను పూజించి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవిప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా.. ఇలా పాములను ఇంట్లో పెంచుకోవడం అంటే.. నిజంగా మనకు మాత్రం ఒళ్లు జలదరిస్తుంది కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version