థాయిలాండ్ లో ఓ మహిళ GPS ను ఫాలో అయి ఎక్కడికి వెళ్లిందో తెలుసా…

-

Thailand :జనవరి 28.. సాయంత్రం 5.40 గంటలకు థాయ్‌లాండ్‌కి చెందిన పాసర్ మకున్ ఇంచాన్ అనే మహిళ కారు నడుపుతూ తాను వెళ్లే మార్గం ఎలా ఉందో చూసుకోకుండా GPS నీ ఫాలో అయి వియాంగ్ థాంగ్ బ్రిడ్జ్‌పై చిక్కుకు పోయింది. ఆ బ్రిడ్జి 120 మీటర్ల పొడవైన వంతెన అది పాదాచారుల కోసం నిర్మించారట. వంతెన పైకి ఆ కారు 15 మీటర్ల ముందుకు వెళ్ళింది.కారు ముందున్న ఎడమ చక్రం బ్రిడ్జ్ ఖాళీలో చిక్కుకుపోయింది.

దాంతో కారు కదలకుండా ఆగిపోయింది. ఆ మహిళ వెంటనే సహాయం కోసం అరుపులు పెట్టడంతో అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి వెంటనే స్పందించి అందరికీ చెప్పడంతో ఆమెను రక్షించడానికి సహాయ చర్యలు ప్రారంభించారు. ప్రమాదకర పరిస్థితి నుండి ఆ మహిళను రక్షించారు.ఈ ఘటనలో ఇంచాన్ చేసిన తప్పిదం ఏంటంటే గుడ్డిగా GPS సూచనలు పాటిస్తూ వెళ్లడమే.GPS మీద ఆధారపడి వెళ్లే మార్గాన్ని చూసుకోకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎదురవుతాయని మరోసారి హెచ్చరికగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version