చిన్న పిల్లలకు హైడ్ అండ్ సీక్ ఆటంటే మహా ఇష్టం. ఈ ఆటలో కొందరు దాక్కుంటే.. ఓ పిల్లాడు వాళ్లందరినీ గుర్తించాలి. చిన్నప్పుడు ఆడే ఈ ఆట అందరికీ ఫేవరేటే. అయితే ఈ పేరుతో ఒక బీచ్ ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ బీచ్ హైడ్ అండ్ సీక్ పేరు ఎలా వచ్చిందనే విషయం తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ బీజ్ రోజుకి రెండు సార్లు కనుమరుగువుతుంది. హా.. అదేంటీ.. బీచ్ కూడా కనుమరుగవుతుందా అని నోళ్లు తెరుచుకుంటున్నారు. అవును ఇది వాస్తవమే. హైడ్ అండ్ సీక్ బీజ్ రోజుకి రెండు సార్లు కనుమరుగు అవుతుంది.
ఒడిశా రాష్ట్రంలో హైడ్ అండ్ సీక్ బీచ్ ఉంది. భువనేశ్వర్ నుంచి జాతీయ రహదారి 5 మీదుగా 200 కిలోమీటర్ల దూరంలో బాలసూర్ జిల్లా రైల్వేస్టేషన్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. చండిపుర సముద్ర తీరంను హైడ్ అండ్ సీక్ అని పిలుస్తారు. ఈ సముద్ర తీరాన ఎత్తైన అలలు, ప్రకృతిని అలా చూస్తుండి పోవాల్సిందే. ఇక్కడి అలలు సుమారు 2-3 కిలోమీటర్ల పైకి వరకు వస్తాయి. ఆ తర్వాత పల్లంగా మారిపోతుంటాయి. ఇలాంటి విచిత్రమైన దృశ్యాన్ని ప్రతిరోజు చూడవచ్చు. ఈ బీచ్‌కు పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే ఉంటుంది. దేశ, విదేశాల నుంచి హైడ్ అండ్ సీక్ బీచ్‌ను చూసేందుకు తండోపతండాలు తరలి వస్తుంటారు.
హైడ్ అండ్ సీక్ బీచ్ రోజుకి రెండు స్థానాన్ని మారుస్తుంది. దీంతో ఈ బీచ్‌ను చూసేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు. మీరు ఒకవేళ ఈ బీచ్‌కి వెళ్లి చూసి వస్తే మళ్లీ అక్కడ కనిపియ్యదు. ఈ బీచ్‌లో జరిగే వింతలు చెప్పడానికి ఎవరికి సాధ్యం కూడా కాదు. చాలా అందంగా కనిపించే ఈ బీచ్ ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ బీచ్‌లో ఎర్ర పీతలు కనిపిస్తుంటాయి. అలాగే పర్యాటకులు సముద్ర వంటకాలను ఆస్వాదించవచ్చు. వీటితోపాటు ఒరియా, బెంగాళీ భోజనం కూడా లభిస్తుంది.
ప్రపంచంలోనే ఏకైక స్థానాన్ని మార్చే బీచ్ హైడ్ అండ్ సీక్. తక్కువ, ఎక్కువ అలల వ్యత్యాసం వల్ల ఈ బీచ్ ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ దేవాలయాలకు సందర్శించినప్పుడు.. హైడ్ అండ్ సీక్ బీచ్‌ను చూసేందుకు వస్తుంటారు. రోజుకి రెండు సార్లు కొన్ని కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లి మళ్లీ తిరిగి వస్తుంది. స్థానికులకు సముద్రం నీరు ఎప్పుడు వెనక్కి వెళ్తుందో బాగా తెలుసు. అందుకే ఆ సమయంలోనే వాళ్లు ముత్యాలు, చేపలు, పీతలను ఏరుకునేందుకు వెళ్తుంటారు. నవంబర్ నుంచి మార్చి మధ్యలో ఈ బీచ్ నీరు అధికంగా వెనక్కి వెళ్లడం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.