విడుదలకు ముందు పైరసీకి గురైన సినిమాలు ఏంటో తెలుసా..

-

పైరసీ.. ఆన్లైన్ లీక్ ఇవన్నీ నిర్మాతలను ఎంతగా భయపెట్టే విషయాల్లో అస్సలు ఊహించలేము.. ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన సినిమా విడుదలకు ముందే పైరసీకి గురైతే ఆ బాధ ఎలా ఉంటుందో కూడా వర్ణించలేము. అయితే ఇప్పటికే ఎన్నో సినిమాలు పైరసీ బారిన పడ్డాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం..

సినిమా నిర్మాణం అంటేనే ఎంతో కష్టంతో కూడుకున్న పని. వేల కోట్లు దీని వెనక పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇవేమీ పట్టనట్టు కొందరు డబ్బులకు ఆశపడి పైరసీ వెంట పడుతూ ఉంటారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన అవతార్ 2 చిత్రం కూడా ఈ పైరసీని ఎదుర్కొంది. సినిమా విడుదలకు ముందు రోజు ఆన్లైన్లో దీని ప్రింట్ ఉండటం అందరిని షాక్కు గురి చేసింది. అయితే ఇలా పైరసీకి ఇంతకుముందు మరిన్ని సినిమాలు గురయ్యాయి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం 2013లో విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలకు 20 రోజుల ముందే ఫస్ట్ ఆఫ్ మొత్తం లీక్ అయిపోయి అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. అలాగే ఈ చిత్రం ఆడియో రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. తమ సినిమా ఇలా ఆన్లైన్లో లీక్ అయినందుకు ఎంతో బాధపడుతున్న సమయంలో.. కొందరు తమకు ఫోన్ చేసి.. మీ సినిమా చాలా బాగుంది, మేము ఆల్రెడీ చూసేసాం అంటూ చెప్తుంటే ఏమనాలో కూడా అర్థం కాలేదు అంటూ తమ బాధను వ్యక్తం చేశారు. అయితే విడుదలైన తర్వాత ఈ చిత్రం మంచి హిట్ అయింది..

అలాగే దర్శకధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి చిత్రానికి కూడా పైరసీ బాధ తప్పలేదు. ఫస్ట్ పార్ట్ లోని క్లైమాక్స్ తో పాటు మరికొన్ని సీన్లు రెండో భాగం లోని ఓ యాక్షన్ సీన్ కూడా విడుదలకు ముందే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ పని చేసింది సినిమాకు పని చేస్తున్న టెక్నీషియన్స్ అనే తెలిసింది..

రజినీకాంత్ కాలా చిత్రం 2018లో విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే క్లైమాక్స్ అంత నెట్లో ప్రత్యక్షమై అందరిని షాక్కు గురి చేసింది..

అలాగే 2004లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో కొన్ని సీన్స్ కూడా విడుదలకు ముందే లీక్ అయిపోయాయి..

అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఎవడు చిత్రం.. తమిళ హీరో విజయ్ మాస్టర్ మూవీ.. బాలీవుడ్ చిత్రం ఉడ్తా పంజాబ్.. అమితాబ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పా చిత్రం.. బాలీవుడ్ మూవీ మాంఝీ.. ఇవన్నీ కూడా విడుదలకు ముందే పైరసీ బారిన పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version