రూ.3,12,191 కోట్లకు చేరిన తెలంగాణ అప్పు

-

తెలంగాణలో అప్పుల భారం ఏటా పెరుగుతోందని కేంద్ర సర్కార్ తెలిపింది. ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు 94.75 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2018లో రూ.1.60లక్షల కోట్లుగా ఉన్న అప్పులు 2022 నాటికి రూ.3.12లక్షల కోట్లకు చేరాయంది. 2017-18లోనే 95.9 శాతం అప్పులు నమోదైనట్టు చెప్పింది. 2017-18 నాటికి గతంతో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021-22నాటికి 16.7 శాతంగా ఉన్నట్టు స్పష్టం చేసింది.

రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం తెలిపింది.  2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా ఆ తరువాత భారీగా పెరుగుదల నమోదైనట్టు వెల్లడించింది. 2022 నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version