మంచు మనోజ్ కు రెండో పెళ్లి చేస్తుంది ఎవరో తెలుసా?

-

కలెక్షన్ కింగ్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి..మోహన్ బాబు రెండవ కుమారుడు నటుడు మంచు మనోజ్ ఇప్పుడు రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొద్ది రోజులుగా ఈయన రిలేషన్ పై రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..మనోజ్ రెండో పెళ్లి చేసుకొని కుటుంబ పరువు తీస్తున్నాడని మోహన్ బాబు దూరం పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. అయితే తమ్ముడి ప్రేమను గెలిపించడానికి మంచు లక్ష్మి తండ్రిని ఎదురించి పెళ్లి చేస్తుందని సమాచారం..తమ్ముడు భవిష్యత్ కోసమే ఆమె ఇలా చేస్తుందని మంచు లక్ష్మీ సన్నిహితులు చెబుతున్నారు..

మరో విషయం ఏంటంటే.. ఈ పెళ్లిని కూడా తన ఇంట్లోనే చేస్తుంది..మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి నుంచి 2019లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తన అన్న మంచు విష్ణు భార్య వెరొణికా రెడ్డి స్నేహితురాలు ప్రణతి రెడ్డిని 2015లో ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు మనోజ్. ఆ తర్వాత బేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. ప్రణతి నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మంచు మనోజ్ మరో పెళ్లి చేసుకుంటారా ? లేదా? అనే అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.

అయితే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గతేడాది క్లారిటీ వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి, శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి హైదరాబాదులోని ఒక వినాయక మండపానికి వెళ్లడం ..ఇద్దరు కలిసి పూజలు చేయడంతో వీరిద్దరి రిలేషన్ పై వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలను ఖరారు చేస్తూ ఈనెల మూడవ తేదీన మనోజ్ , మౌనిక వివాహం చేసుకోబోతున్నారు. నిన్నటి నుంచి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. నిన్న హల్దీ ఫంక్షన్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.

ఇదిలా వుండగా మరోవైపు ఈ పెళ్లికి మంచు మోహన్ బాబు సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మంచు మనోజ్ రెండవ వివాహంగా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు మోహన్ బాబు అంటూ వార్తలు వినిపించాయి. మంచు మనోజ్ ప్రేమ కారణంగానే.. ఆయనని కొద్ది రోజులు మోహన్ బాబు తనఇంటికి దూరంగా పెట్టారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు రియలైజ్ అయిన మోహన్ బాబు తన కొడుకు పరిస్థితిని.. ఒంటరితనాన్ని గుర్తించి ఆయన ఈ పెళ్లికి రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చెయ్యాల్సిందే.. ఏది ఏమైనా మనోజ్ ఓ ఇంటివాడు అవుతున్నాడు..

Read more RELATED
Recommended to you

Exit mobile version