కేంద్రం వివిధ రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. కేంద్రం తీసుకు వచ్చిన ఈ స్కీమ్స్ వలన చాలా మందికి చక్కటి ప్రయోజనాలు కలుగుతున్నాయి. అలానే కేంద్రం రైతుల కోసం కూడా కొన్ని స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. వాటిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఒకటి. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. ప్రతీ ఏటా రూ. 6 వేలు ని ఈ స్కీమ్ లో భాగంగా ఇస్తున్నారు.
తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 13వ విడత లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు జమ చేసింది. ఈ విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది రైతుల అకౌంట్ లోకి రూ. 16,000 కోట్లు జమ చేశారు. అయితే రైతులు అందరికీ ఈ డబ్బులు అందలేదు. కొందరు రైతుల ఖాతాల్లోకి మాత్రం డబ్బులు పడలేదు. మీకూ డబ్బులు పడలేదా..? అయితే ఇలా ఫిర్యాదు చెయ్యచ్చు. మరి అది ఎలానో ఇప్పుడే చూద్దాం.
ఈ స్కీమ్ డబ్బులు అందకపోయినట్టైతే ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ ద్వారా ఫిర్యాదు చెయ్యచ్చు.
pmkisan-ict@gov.in. and pmkisan-funds@gov.in ని సంప్రదించవచ్చు.
లేదా హెల్ప్‌లైన్ నెంబర్ 011-24300606,155261, టోల్ ఫ్రీ నెంబర్ 1800-115-526కి కాల్ చెయ్యవచ్చు. ఇలా ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
లబ్ధిదారుల జాబితాను చెక్ చేసేందుకు అయితే ముందుగా పీఎమ్ కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
ఆ తరవాత ‘బెనిఫిషియరీ స్టేటస్’ పై క్లిక్ చేయాలి.
ఆధార్ కార్డు, అకౌంట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ని ఎంపిక చేసుకుని ఎంటర్ చేయాలి.
‘గెట్ డేటా’పై క్లిక్ చేస్తే మీ నిధుల స్టేటస్ ని తెలుసుకోవచ్చు.