బాబు మోహన్ ను చంపాలని చూసింది ఎవరో తెలుసా..?

-

తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు బాబూ మోహన్.. గతంలో ఈయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు. కమెడియన్ కి చక్కటి నిదర్శనం బాబు మోహన్ గారు. ముఖ్యంగా అందమైన రూపం , మంచి ఎత్తు ఉండాలని భావించే రోజుల్లో అవేవీ లేకుండా తన నటనతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు బాబు మోహన్. ఇక ఎన్నో వందల చిత్రాలలో నటించిన ఈయన ఆల్ ఇండియా అందగాడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఇక స్వర్గీయ సౌందర్య వంటి అగ్ర హీరోయిన్లే ఈయనతో నటించారంటే ఈయన క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు తో కలిసి ఈయన చేసే కామెడీ ప్రేక్షకులకు వేరే లెవెల్. ఇక వీరిద్దరిదీ మంచి జోడి మాత్రమే కాదు నిజజీవితంలో కూడా చాలా దగ్గర స్నేహితులు. ఇక ఎన్నో సంవత్సరాలు పాటు హాస్యనటుడిగా చలామణి అయిన బాబు మోహన్ ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలు పోషించారు. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈయన అక్కడ కూడా విజయం సాధించారు. ఇక ఊహించిన విధంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా , ఒకసారి మంత్రిగా గెలిచిన ఈయన కొన్ని రోజులు టిఆర్ఎస్ లో కూడా పనిచేశాడు. ఇక ఇప్పుడు బిజెపిలో పని చేస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత విషయానికి సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. బాబు మోహన్ మాట్లాడుతూ సినిమాలు చేసేటప్పుడు భరణి పాన్ తినే అలవాటు ఉండేది. అది వ్యసనంగా మారి రోజుకు 30 ప్యాకెట్ల వరకు తినేవాడిని. ఇక మంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పాన్ తింటూనే వెళ్లడం అలవాటయింది. హైదరాబాద్ రావాలి అంటే సంగారెడ్డి మీదుగా వచ్చేవాడిని. ఇక ఆ సమయంలోనే ఒక పాన్ షాప్ దగ్గర పాన్ కట్టించుకొని వెళ్లేవాడిని. ఇక అదే అలవాటు చాలా సంవత్సరాలు పాటు కొనసాగింది. ఇక అలవాటులో ప్రకారమే ఒక షాప్ లో పాన్ కట్టించుకొని వెళ్తూ కొంచెం దూరం వెళ్లాక పాన్ డబ్బా తెరిచి తిందామనుకుంటూ ఉండగా పాన్ షాప్ అతను ఫోన్ చేసి పాన్ తినొద్దని, అందులో విషం ఉందని, ఆ తర్వాత అతడి భార్య ఫోన్ చేసి మీ ప్రత్యర్ధులు బెదిరించడం వల్ల అలా చేశామని చెప్పి ఏడ్చింది ఇక ఆరోజు అర్థమైంది రాజకీయాలు ఇంత నీచంగా ,భయంకరంగా ఉంటాయా అంటూ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version