కొత్త వాహనాలు కొన్నపుడు చాలామంది నిమ్మకాయలు కడుతారు ఈ విషయం అందరికి తెలిసిందే. ఇక ఎవరైనా ఏ వాహనమైనా కొనుక్కున్నప్పుడు దానికి శాస్త్రోక్తంగా పూజ చేయించే పద్ధతిని హిందువులు పాటిస్తారు. ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది అని అందరి నమ్మకం. ఇక ఎవరి దిష్టి వారిపై పడకుండా ఉండేందుకు ఆలా చేస్తారని పెద్దలు చెబుతుంటారు.
ఇక సాధారణంగా ఎవరైనా హనుమంతుడు లేదా దుర్గా దేవిల ఆలయాలకు వెళ్లి ఈ పూజచేస్తారు. దుకంటే వారు దుష్టశక్తులను తరిమే ఉగ్ర దేవతలు. అందుకనే చాలామంది అలా చేస్తారు. అయితే వాహనాలకు పూజ చేసే సమయంలో దానికి నిమ్మకాయలు, మిరపకాయలను కలిపి దండగా గుచ్చి ఆ దండను కడతారు. అలా ఎందుకు తెలుసా..? దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకుందాం.
అయితే గ్రహాలలో ఎర్రనిది, ఉగ్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రనమ్మకం. కుజుని అధిదైవం హనుమంతుడు. అలాగే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం రవిగ్రహానికి చెందినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు కడతారు.
లక్ష్మీదేవికి తీపి వంటకాలు అంటే ఎంత ఇష్టమో ఆమె అక్క అయిన అ లక్ష్మికి కారం, పులుపు వంటకాలంటే అంత ఇష్టమట. అందుకని ఆవిడను శాంతింపజేయడానికి వాహనాలకు అలా కారం ఉండే మిరపకాయలు, పులుపు ఉండే నిమ్మకాయలను కడతారు. దీంతో ఆవిడ శాంతించి వాహనాలకు ఎలాంటి ప్రమాదం కలగనీయదట. అందుకనే వాటిని దండలుగా కడతారు. నరుడి దృష్టికి నాపరాళ్లయినా ఇట్టే పగులుతాయి, అని అందరికీ తెలిసిందే. అయితే అలా తగిలే దిష్టిని హరించేందుకు, వాహనాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేందుకు శాంతిగా అలా మిరప, నిమ్మ కాయలను కడతారు.