చర్మం కాంతివంతంగా మెరవడానికి కల్తీ లేని ఈ పానీయం తీసుకోండి..!?

-

కొబ్బరి నీళ్లు ఒక్క గ్లూకోజ్ బాటిల్ తో సమానం అని అందరు చెప్తారు. ఇక నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీ లేని కల్తీ జరగని పానీయం ఏదైనా ఉంది అంటే అది కొబ్బరినీరు మాత్రమే అని చెప్పక తప్పదు. ఈ ప్రపంచంలో కొబ్బరి నీటితో సాటి రాగల నీరు మరి ఏది లేదు.లేత కొబ్బరి నీటిలో ప్రధానంగా చక్కెరలు ఉంటాయి. కొబ్బరి బాగా ముదిరిన తరువాత నీటిలో చక్కెర శాతం పడిపోతూ ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు లేత కొబ్బరి నీరు కాకుండా కొంచెం ముదిరిన కొబ్బరి నీటిని తాగడం ఉత్తమం. కానీ లేత కొబ్బరి నీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వలన వెంటనే ఎక్కువ శక్తిని అందిస్తుంది . వేసవిలో అయితే వేడి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.

cocount water

అయితే కొబ్బరి నీళ్లలో ఐరన్, మినరల్స్ ప్రోటీన్స్, కొవ్వు, పిండిపదార్థాలు, కాల్షియం, మెగ్నీషియం, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో 2 టీస్పూన్లు నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యం అవుతాయి. కొబ్బరినీళ్లు బీపీని అదుపులో ఉండేలా చేస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండె ను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి.

ఇక కొబ్బరినీళ్ల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలోని విషాలను అరికడతాయి. కిడ్నీలో రాళ్లను కరిగించే లక్షణాలు కొబ్బరి నీళ్ల లో ఎక్కువగా ఉన్నాయి. కొబ్బరి నీరు తాగడం వలన అధిక బరువు సమస్య తగ్గుతుంది. ఏదైనా కారణం చేత నీరసంగా అనిపిస్తే తక్షణ శక్తి కోసం కొబ్బరి నీళ్లు బాగా సహాయపడతాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అజీర్ణ సమస్యలు తగ్గి శరీరానికి కొత్త శక్తి వచ్చి రోజంతా ఉత్సాహం గా ఉండడానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి నీటిని తాగడం వలన చర్మకాంతి మెరుగుపడుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version