ఈ చెప్పులకు అంత డిమాండ్ ఎందుకో తెలుసా?

-

కొందరు ప్రముఖ వ్యక్తులు వాడిన వస్తువులను కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు.ఇప్పటికే ఎన్నో వస్తువులు వేలానికి వచ్చి భారీగా అమ్ముడు పోయాయి..ఇప్పుడు మరో వస్తువు మంచి డిమాండ్ తో దూసుకుపోతుంది.. యాపిల్‌ కో ఫౌండర్‌ స్టీవ్ జాబ్స్ ధరించిన పాత, అరిగిపోయిన చెప్పులు ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచారు..1970, 80ల కాలంలో ఆయన వేసుకున్న బ్రౌన్ స్వెడ్ లెదర్ బిర్కెన్‌స్టాక్ అరిజోనా చెప్పులను వేలానికి ఉంచింది. వీటి 60వేలు- 80 వేల డాలర్లు (మన కరెన్సీలో రూ. 48లక్షల నుంచి 64 లక్షలకు పైనే) ధర నిర్ణయించారని వేలం జూలియన్స్ ఆక్షన్స్‌ నిర్వాహకుడు వెల్లడించారు..

నవంబర్ 11న మొదలు కాగా, నవంబర్ 13న ముగియనుంది. మార్క్ షెఫ్, స్టీవ్ జాబ్స్ హోమ్ మేనేజర్, 1980 లలో కాలిఫోర్నియాలోని అల్బానీలో బిర్కెన్‌స్టాక్ చెప్పులను భద్రపరిచారు. జూలియన్స్ వేలం వెబ్‌సైట్‌లోని తాజా సమాచారం ప్రకారం, బిడ్ 15 వేల డాలర్ల వద్ద వద్ద ప్రారంభమై 22,500 డాలర్ల వద్ద ఉంది. బిడ్‌ గెలిచిన వాళ్లు చెప్పులతోపాటు, చెప్పుల ఎన్‌ఎఫ్‌టీని కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫోటోగ్రాఫర్ జీన్ పిగోజీ బుక్‌”ది 213 మోస్ట్ ఇంపార్టెంట్ మెన్ ఇన్ మై లైఫ్” ను కూడా దక్కించుకోవచ్చు..

అనేక కీలకమైన క్షణాల్లో స్టీవ్ జాబ్స్ ఈ చెప్పులను ధరించినట్లు వేలం సంస్థ పేర్కొంది. 1976లో సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి లాస్ ఆల్టోస్ గ్యారేజీలో యాపిల్ కంప్యూటర్ ఆవిష్కరణ సందర్భంగా ఇదే చెప్పులను ధరించారట. కాగా, ఈ సాండిల్స్‌ను ఇప్పటికే పలుఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శించారు. 2017లో ఇటలీలోని మిలన్‌లో సలోన్ డెల్ మొబైల్, 2017లో జర్మనీలోని రహ్మ్స్‌లోని బిర్కెన్‌స్టాక్ హెడ్‌క్వార్టర్స్, న్యూయార్క్‌లోని సోహోలో, జర్మనీలోని కొలోన్‌లో IMM కోల్న్ ఫర్నిచర్ ఫెయిర్ వంటి అనేక ప్రదర్శనలలో వీటిని ఉంచినట్లు తెలుస్తుంది..రోడ్లపై పడేసిన కోక్ బాటిల్స్ అమ్ముకునే స్థాయినుంచి గ్లోబల్‌ టెక్‌ లీడర్‌గా ఎదిగిన ఆయన ప్రస్తానం పలువురికి స్ఫూర్తిదాయకమని చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Latest news