కూల్ డ్రింక్స్ అంటే ఇష్టముండని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరైనా కూల్ డ్రింక్స్ అంటే పడి చచ్చిపోతారు. కొంతమంది మందులో కూడా కూల్ డ్రింక్స్ ను కలుపుకొని తాగుతారు. ఇంటికి ఎవరైనా బంధువులు, అతిథులు వచ్చినా.. ఫంక్షన్ అయినా.. ఇంకేదైనా అక్కడ కూల్ డ్రింక్ ఉండాల్సిందే. పచ్చిగా చెప్పాల్నంటే కూల్ డ్రింక్ లేని మనిషి జీవితాన్ని ఊహించుకోలేము.
కానీ.. ఆ కూల్ డ్రింక్సే మనిషి కొంప ముంచుతున్నాయి. షుగర్ లేవెల్స్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, సోడాను అదే పనిగా తాగేవాళ్లకు కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. ఎప్పుడో ఒకసారి తాగితే ఏం కాదు కానీ… ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగితే మాత్రం మీరు కిడ్నీ సమస్యలను ఎదుర్కోవాల్సిందే.
సాధారణ వ్యక్తుల కంటే.. అధికంగా కూల్ డ్రింక్స్ తాగేవాళ్లలో కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం 61 శాతం ఎక్కువ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే… ఇప్పటి నుంచైనా కూల్ డ్రింక్స్ అధికంగా తాగే అలవాటు ఉన్నవాళ్లు కాస్త తగ్గిస్తే బెటర్. లేదంటే… అనవసరంగా కిడ్నీ సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది.