ఇప్పుడు స్కూల్స్, కాలేజీల ముందు కాఫీ షాప్‌లు, బేకరీలు, ఎగ్‌పఫ్‌లు ఇవే ఉంటున్నాయి.. కానీ 80s, 90sలో అదేనండీ మన చిన్నప్పటి రోజుల్లో పుల్ల ఐసులు, ఆశ చాక్లెట్స్, బిగ్‌బబూల్, పీచుమిఠాయి, కాగితం అప్పడం, చకోడీలు అబ్బో ఇవన్నీ పైసలకే వచ్చేవి.. మధ్యాహ్నం భోజనం చేశాక, సాయంత్రం ఇంటికి వచ్చేప్పుడు ఇవి తినుకుంటూ మైళ్లకొద్ది దూరాన్ని అయినా అవలీలగా నడుచుకుంటూనో, సైకిల్ తొక్కుకుంటూనో వెళ్లే వాళ్లం.. అసలు ఆ రోజులే వేరుకదా..!
ఇప్పుడు అవి తిందాం అన్నా దొరకడం లేదు. పీచుమిఠాయిలు ఇప్పుడు పింక్ కలర్‌లో ఉంటాయి..మనం తినే రోజుల్లో ఉండే రుచి అస్సలు ఉండవు. స్కూల్‌బయట బామ్మకొట్టులో అమ్మేవి.. ఇప్పుడు ఒకటో రెండు మాల్స్‌లో దొరుకుతున్నాయి.. మనం ఆరోజుల్లో తిన్న చిరుతిళ్లు అన్నీ ఇప్పుడు అదే రుచితే.. ఒకే దగ్గర ఉంటే.. ఎలా ఉంటుందో ఓసారి ఇమాజిన్.. బాగుందికదా..! సరిగ్గా అలాంటి షాపే తమిళనాడు జిల్లా మధురైలో ఉంది. ఆ షాప్‌కు వెళ్తే బాల్యం గుర్తుకువస్తుంది..!! అంతా బాగుంటుందండీ..!!
80, 90లో పిల్లలు రకరకాల చిరుతిళ్లు లభించేవి. అవేవీ ఇప్పుడు మార్కెట్లలో లేవు. కానీ తమిళనాడు.. మధురైలో మాత్రం ఓ షాపులో అవన్నీ లభిస్తున్నాయి. తెప్పకులం ఏరియాలోని ఈ షాపు ఉంది. ఈ షాపు చూడటానికి చిన్నగానే ఉన్నా.. దీనికి రద్దీ మాత్రం ఎక్కువగానే ఉంటోంది. ఎక్కడెక్కడి వారో ఇక్కడికి వచ్చి.. తమ చిన్నప్పటి చిరుతిళ్లను కొనుక్కుంటున్నారట.
మమ్మీ డాడీ, ఆశ చాక్లెట్, పుల్ల ఐసు, మామిడి తాండ్ర, పీచు మిఠాయి, పల్లీ కోడి గుడ్డు, పేపర్ అప్పడం, పేపర్ బిస్కెట్, పాలకోవా, కలర్ జెల్లీలు ఇలా ఎన్నో రకాల చిరుతిళ్లు 90లో పిల్లలకు లభించేవి. వాటిలో కొన్ని తియ్యగా, కొన్ని పుల్లగా ఉండేవి. మరికొన్ని నోటిని ఎర్రగా చేసేవి. ఇంకొన్నింటిని ముందుగా ఆడుకొని తర్వాత తినేసేవారు. ఇవన్నీ అప్పట్లో తెగ తినేవాళ్లం కదా..!
90లో క్యాండీస్ అన్నీ ఈ షాపులో మీకు హోల్‌సేల్, రిటైల్‌గా లభిస్తాయి. ఇక్కడ మీరు విజిల్ క్యాండీ, క్రేజీ పాప్ క్యాండీ, స్టిక్ క్యాండీ, టిట్ బిట్స్, క్యుమిన్ క్యాండీ ఇలా ఎన్నో కొనుక్కోవచ్చు.
ఈ స్నాక్స్ అన్నీ ఎరోడ్ జిల్లాలోని తమ ఇంటి దగ్గరే తయారుచేస్తారని ఓనర్ తెలిపారు. తమ కుటుంబం అంతా కలిసి ఈ షాపును రన్ చేస్తున్నారట. అని 90ల నాటి వారు తినే అన్ని చిరుతిళ్లనూ హోల్‌సేల్‌కి ఇప్పుడు అమ్మాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారం ప్రారంభించినట్లు ఓనర్ తెలిపారు.. ఇలా ఈ షాపు.. అప్పటి వారిని బాల్యంలోకి తీసుకెళ్తేంది. వారి స్కూల్ డేస్‌ని గుర్తు చేస్తోంది. ఎంతైనా బాల్యం చాలా అందంగా, అమాయకంగా ఉండేది.. తినడానికి చాలా ఉండేవి.. అన్నీ అందుబాటులో ఉండే ధరలే..ఇప్పుడు ఏదో టెక్నాలజీ పెరిగిపోయింది.. అప్డేట్ అయ్యాం, స్మార్ట్‌ఫోన్లతో స్మార్ట్‌గా ఉంటున్నాం అని అనుకుంటున్నాం కానీ..మీ నానమ్మ, తాతయ్య అంతెందుకు మీ మమ్మీడాడీలను అడగండి..వాళ్ల చిన్నతనం ఇవేవి లేకుండా ఎంతో సంతోషంగా ఉందని చెప్తారు.