ఈ మసాలా దినుసులను ఉపయోగిస్తున్నారా..? అయితే ఆ సమస్యలే రావట…!

-

మన వంటింట్లో ఉపయోగించే కొన్ని మసాలా దినుసులు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. పూర్వ కాలం నుంచి వీటిని మనం అనుసరిస్తున్నాం కాని వాటి వల్ల చాలా మేలు కలుగుతుందని చాలా మందికి తెలియదు. ఈ మసాలా దినుసులను వంటల్లో తరచూ ఉపయోగించడం వల్ల చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

 

అయితే మరి ఇటువంటి మసాలా దినుసులు వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి..?, ఎలాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు అనేది ఆరోగ్య నిపుణులు చెప్పారు. మరి ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన సూత్రాలను ఇప్పుడు చూద్దాం.

చిన్న చిన్న సమస్యలను మనం వంటగదిలో ఉండే మసాలా దినుసుల తో చెక్ పెట్టొచ్చు అని అంటున్నారు. వీటిని కనుక వంటల్లో తరచుగా ఉపయోగిస్తే ఎన్నో ఇబ్బందులు నుంచి బయట పడొచ్చు.

మెంతులు:

మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలానే ఇమ్యూనిటీని కూడా ఇది పెంచుతుంది. లివర్ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది.

అల్లం:

అల్లం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు వికారం వంటి సమస్యలు కూడా అల్లం పోగొడుతుంది. శరీరంలో ఉండే చెడు పదార్థాలను బయటకు పంపించడానికి కూడా సహాయం చేస్తుంది అల్లం.

పసుపు:

పూర్వకాలం నుండి వంటల్లో పసుపుని ఉపయోగిస్తూనే ఉన్నారు. పసుపు వాత కఫ దోషాలను తొలగిస్తుంది. పసుపును ఉపయోగించడం వల్ల కీళ్లనొప్పులు గుండె జబ్బులు వంటివి ఉండవు. షుగర్ తో బాధపడే వాళ్లు కూడా పసుపును తీసుకుంటే మంచిది. ఇమ్యూనిటీని కూడా ఇది పెంచుతుంది.

దాల్చిని:

దాల్చిని కూడా ఆరోగ్యానికి చాలా మంచిది యాంటీ బాక్టీరియల్ గుణాలు యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అలానే యాంటీవైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇమ్యూనిటీ కూడా ఇది పెంచుతుంది. దంతాల ఆరోగ్యానికి, చర్మ సమస్యలను తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version