అర్ధరాత్రి 1-3 మధ్యలో నిద్ర లేస్తున్నారా..? కారణాలు ఇవే కావొచ్చు..

-

కొంతమందికి రాత్రి అయినా నిద్ర రాదు.. నిద్ర లేమి సమస్యతో తెగ ఇబ్బంది పడతారు. ఎలా గోలా నిద్రపోతే..అర్ధ రాత్రుళ్లు మేలుకుంటారు. అర్ధరాత్రి 1 నుంచి 3 గంటల మధ్యలో మేలుకుంటారు. ఆ తర్వాత ఎంత నిద్రపోదాం అన్నా.. అస్సలు నిద్రపట్టదు. అర్ధరాత్రి నిద్రలేవడానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది మూత్ర విసర్జన కోసం లేస్తారు. మరికొందరు దాహంతో లేస్తారు. ఇంకొందరు నిద్రిచే భంగిమ సరిగా లేక ఒత్తిడితో నిద్రలోనుంచి లేస్తారు. కారణం ఏదైనా.. అర్ధరాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేవడం రోజూ జరుగుతుందంటే..అనారోగ్య సమస్యే.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఈ సమయంలో నిద్ర లేస్తే.. శరీరంపై ఒత్తిడి పడుతుంది. ఏదో ఒకరోజు అలా జరిగితే ఏం కాదు. కానీ అదే అలవాటుగా అయితే మాత్రం సమస్యే.

అర్ధరాత్రి లేవడానికి కారణాలు..

ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటే.. ఇలా రోజూ రాత్రి సమయంలో నిద్ర లేస్తారు.
మెడిసిన్ వాడే వారు, షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉండేవాళ్లు ఇలా అర్ధరాత్రి నిద్ర లేస్తారు.
వయసు మీద పడటం
నిద్రలేమి,
పలు రకాల మందులను దీర్ఘకాలంగా ఉపయోగించడం లాంటి కారణాలు కూడా రాత్రి 1 నుంచి మూడు మధ్యలో నిద్రలేవడానికి కారణాలు. యాంటి డిప్రెసెంట్లు, బీటా బ్లాకర్స్, కార్టికో స్టెరాయిడ్స్, దగ్గు, జులుబు మందులను వాడటం, డై యూరెటిక్స్ వాడకం వలన రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేస్తారు.
మందులను వాడకం తప్పించి.. ఏ కారణంతో అయినా.. నిద్ర లేస్తుంటే.. మాత్రం ఆ సమస్య నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేయాలి. లేదంటే ఇతర సమస్యలు వస్తాయి.

లివర్ పనితీరు మందగించడం, నిద్రలేమీతో కూడా ఇలా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 10-20 శాతం మందికి నిద్రలేమితో బాధపడుతున్నారు.. పెద్దవారిలో ఈ రేటు 40 శాతానికి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.. స్లీప్ అప్నియా, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆర్థరైటిస్, డిప్రెషన్, నరాలవ్యాధి, మెనోపాజ్, అతి చురుకైన థైరాయిడ్ గ్రంధి ఈ సమస్యలు ఉన్నా.. అర్ధరాత్రి నిద్రలో లేస్తారు. కాబట్టీ మీరు తరచూ అర్ధరాత్రుల్లో లేస్తుంటే…కారణాలు ఏంటో అన్వేషించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version