Tik tok : అమెరికాలో మైనర్లకు గంటసేపే టిక్‌టాక్

-

టిక్‌టాక్ యాప్‌కు చాలామంది అడిక్ట్ అయ్యారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లు ఈ యాప్‌ను ఎక్కువ సేపు వినియోగించి చదువుపై ఫోకస్ పెట్టడం లేదు. అయితే ఇలాంటి పిల్లలను టిక్‌టాక్‌ అతిగా వినియోగించకుండా ఉండేందుకు ఆ సంస్థ చర్యలు తీసుకుంటోంది. అయితే ఇది ఇండియాలో కాదు అమెరికాలో.

అమెరికాలో తమ యాప్‌ను వినియోగించే మైనర్లకు 60 నిమిషాల సమయ పరిమితిని వచ్చే కొద్ది వారాల్లో విధించబోతున్నట్లు టిక్‌టాక్‌ ప్రకటించింది. యాప్‌పై వివిధ కారణాలతో పలు రాష్ట్ర ప్రభుత్వాల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

టిక్‌టాక్‌ సంస్థ విశ్వాసం, భద్రత విభాగం అధిపతి కార్మాక్‌ కీనన్‌ బుధవారం తన బ్లాగ్‌లో పెట్టిన పోస్టులో..‘‘60 నిమిషాల సమయం పూర్తి కాగానే..యాప్‌ను వీక్షించేందుకు.. పాస్‌కోడ్‌ను నమోదు చేసి క్రియాశీల నిర్ణయం తీసుకోవాలని మైనర్లకు సూచన వస్తుంది. అలాంటి సమయంలో 13 ఏళ్ల లోపు వినియోగదారులకు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అప్పటికే రూపొందించుకున్న పాస్‌కోడ్‌ను నమోదు చేస్తే యాప్‌ను వీక్షించేందుకు మరో 30 నిమిషాల అదనపు సమయం లభిస్తుంది’’అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version