Pfizer’s vaccine : ఈ వ్యాక్సిన్ తీసుకున్న 16 రోజులకే మృతి …!

-

కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాక్సింగ్ కోసం ఎంతో మంది డాక్టర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక వైద్యుడు Pfizer’s వ్యాక్సిన్ తీసుకుని 16 రోజుల తరువాత మరణించడం జరిగింది. 56 ఏళ్ళ ఈ డాక్టర్ కి జనవరి 3వ తేదీన వ్యాక్సిన్ ని ఇచ్చారు. ఇతని భార్య Pfizer’s వాక్సిన్ తీసుకుని తన భర్త చనిపోయాడు అని చెప్పింది. జనవరి 3న ఫస్ట్ డోస్ తీసుకున్నట్టు కూడా చెప్పింది. ఈ విషయం పై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు యూఎస్ డాక్టర్లు.

pfizer vaccine

డాక్టర్ మైకేల్ సినాయి మెడికల్ సెంటర్లో పదేళ్ల నుండి పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ డాక్టర్ భార్య తన భర్త ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని రోజులకే విచిత్ర సింప్టమ్స్ కనిపించాయని అంది. కాళ్లు చేతుల్లోని చిన్న స్పాట్స్ వంటివి కూడా వచ్చాయని ఈమె చెప్పింది. ఇలా వచ్చిన తర్వాత తనని ఐసీయూ లో పెట్టారు అని కూడా ఈమె చెప్పడం జరిగింది.

ఈ వైద్యుడి పరిస్థితి పై తన భార్య ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల అతనికి స్ట్రోక్ కూడా వచ్చిందని కూడా వెల్లడించింది. Pfizer’s వ్యాక్సిన్ తీసుకున్నాకే ఇలా జరిగిందని చెప్పింది కానీ Pfizer’s కంపెనీ మాత్రం ఇలాంటివేమీ వ్యాక్సిన్ ద్వారా కనిపించవు అని చెప్పింది. కరోనా మహమ్మారై 195 దేశాలు పాటు విస్తరించింది. 8.88 కోట్ల ప్రజల కి ప్రపంచ వ్యాప్తంగా ఇది వ్యాపించడం జరిగింది. 19 లక్షల వరకూ జనం ఈ కరోనా కారణంగా చనిపోవడం కూడా జరిగింది. ఇండియాలో 10 మిలియన్ల వరకు ప్రజలకు ఇది సోకడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version