మాకు వందల ఎకరాల పొలాలు ఉన్నాయని… అవి చూసుకోవడానికి సమయం సరిపోవడం లేదని విశాఖ వైద్యుడు డాక్టర్ సుధాకర్ వ్యాఖ్యానించారు. అలాంటిది రాజకీయాలతో నాకు పనేంటి? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయమంటేనే అసహ్యం. ఉద్యోగమే నాకు ముఖ్యమని అన్నారు ఆయన. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని డాక్టర్ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారు.
సస్పెండ్ అయిన దగ్గర నుంచి బ్యాడ్ ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయన్నారు ఆయన. టార్చర్ భరించలేక బయటకు వెళ్లడానికి కూడా భయపడ్డా అని ఆవేదన వ్యక్తం చేసారు. బ్యాంక్ పనిమీద నక్కపల్లి వెళ్లాల్సి వచ్చిందన్నారు. అప్పుడు కొందరు అల్లరి చేసారని పేర్కొన్నారు. సీఎం జగన్ గారు నాకు దేవుడని ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. మోదీ గారిని కూడా నేను తిట్టలేదన్నారు ఆయన. వాళ్లను తిట్టే ధైర్యం ఉందా? అంటూ…
శత్రువులను కూడా నేను తిట్టనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అంటే ఎంతో ఇష్టమన్నారు సుధాకర్. అలాంటి నాయకుడ్ని తిడతానా? అని ప్రశ్నించారు. ఇక జగన్ గారైతే పేదల పాలిట మంచి పనులే చేస్తున్నారని కొనియాడారు. నాకు ఆ పార్టీ.. ఈ పార్టీ అంటూ ఏమీ ఉండదన్నారు. చంద్రబాబు పార్టీ అంటూ ముద్ర వేస్తున్నారని, ఆయన హయాంలో కూడా పని చేశానని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు కార్యకర్తనైతే కాదని స్పష్ట౦ చేసారు.