చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ భారత్‌లో ఎంఐ నోట్‌బుక్ 14 పేరిట ఓ నూతన ల్యాప్‌టాప్‌ను ఇవాళ విడుదల చేసింది. ఇది 2 రకాల మోడల్స్‌లో విడుదలైంది. ఎంఐ నోట్‌బుక్ 14 హారిజాన్ ఎడిషన్, నార్మల్ ఎడిషన్‌లలో వినియోగదారులకు ఈ ల్యాప్‌టాప్ లభిస్తోంది. హారిజాన్ ఎడిషన్‌లో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ హారిజాన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 3ఎంఎం సైజు ఉన్న పలుచని బెజెల్స్ దీనికి ఉంటాయి. ఇక నార్మల్ వెర్షన్‌లో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఇంటెల్ కోర్ ఐ5 లేదా ఐ7 మోడల్‌కు చెందిన 10వ జనరేషన్ ప్రాసెసర్ లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 2జీబీ ఎన్‌వీడియా ఎంఎక్స్250 లేదా 350 గ్రాఫిక్స్ కార్డ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ తదితర ఫీచర్లను వీటిల్లో అందిస్తున్నారు.
ఇక ఎంఐ బ్యాండ్ 3 లేదా 4 స్మార్ట్ బ్యాండ్‌తో ఈ ల్యాప్‌టాప్‌లను అన్‌లాక్ చేసుకోవచ్చు. అందుకు గాను వీటికి ఎంఐ బ్లేజ్ అన్‌లాక్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. సదరు బ్యాండ్‌లను ఈ ల్యాప్‌టాప్‌ల దగ్గరకు తీసుకురాగానే ఈ ల్యాప్‌టాప్‌లు వాటంతట అవే ఆటోమేటిగ్గా అన్‌లాక్ అవుతాయి. అలాగే ఈ ల్యాప్‌టాప్‌లలో అందిస్తున్న ఎంఐ స్మార్ట్ షేర్ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉన్న ఫైల్స్‌ను వీటిలోకి సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లలో ఏర్పాటు చేసిన 46 వాట్ల బ్యాటరీ వల్ల 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. వీటికి 65 వాట్ల చార్జర్‌ను అందిస్తున్నారు. దీంతో ల్యాప్‌టాప్‌లు చాలా వేగంగా చార్జింగ్ అవుతాయి. 0 నుంచి 50 శాతం చార్జింగ్ పూర్తయ్యేందుకు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.
ఎంఐ నోట్‌బుక్ 14, ఎంఐ నోట్‌బుక్ 14 హారిజాన్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు…
* 14 ఇంచుల డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.8 గిగాహెడ్జ్ ఇంటెల్ కోర్ ఐ7-10510యు లేదా 1.6 గిగాహెడ్జ్ ఇంటెల్ కోర్ ఐ5-10210యు ప్రాసెసర్
* 2జీబీ జీడీడీఆర్5 ఎన్‌వీడియా జిఫోర్స్ ఎంఎక్స్ 250 లేదా ఎంఎక్స్ 350 గ్రాఫిక్స్ కార్డ్
* 8జీబీ డీడీఆర్4 ర్యామ్, 256జీబీ/512జీబీ ఎస్ఎస్‌డీ లేదా 512జీబీ ఎం.2 ఎన్‌వీఎంఈ ఎస్ఎస్‌డీ
* విండోస్ 10 హోం ఎడిషన్, నెల రోజుల పాటు ఉచిత ఆఫీస్ 365
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ 3.1, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ టైప్ సి
* 3.5ఎంఎం హెడ్‌ఫోన్/మైక్రోఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లు, డీటీఎస్ ఆడియో
* 46 వాట్ల బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్, 65 వాట్ల అడాప్టర్
ఎంఐ నోట్‌బుక్ 14 మెర్క్యురీ గ్రే కలర్ ఆప్షన్‌లో విడుదలైంది. జూన్ 17 నుంచి ఈ ల్యాప్‌టాప్‌లను విక్రయిస్తారు. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్, ఎంఐ స్టూడియోలలో ఈ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయవచ్చు. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* ఎంఐ నోట్‌బుక్ 14 (1901-ఎఫ్‌సీ) కోర్ ఐ5, 8జీబీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్‌డీ – ధర రూ.41,999
* ఎంఐ నోట్‌బుక్ 14 (1901-ఎఫ్ఏ) కోర్ ఐ5, 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్‌డీ – ధర రూ.44,999
* ఎంఐ నోట్‌బుక్ 14 (1901-డీజీ) కోర్ ఐ5, 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్‌డీ, ఎంఎక్స్250 గ్రాఫిక్స్ కార్డ్ – ధర రూ.47,999
* ఎంఐ నోట్‌బుక్ 14 హారిజాన్ (1904-ఏఆర్) కోర్ ఐ5, 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్‌డీ, ఎంఎక్స్ 350 గ్రాఫిక్స్ కార్డ్ – ధర రూ.54,999
* ఎంఐ నోట్‌బుక్ 14 హారిజాన్ (1904-ఏఎఫ్) కోర్ ఐ7, 8జీబీ ర్యామ్, 512జీబీ ఎన్‌వీఎంఈ ఎస్ఎస్‌డీ, ఎంఎక్స్ 350 గ్రాఫిక్స్ కార్డ్ – ధర రూ.59,999
కాగా లాంచింగ్ సందర్భంగా ఈ ల్యాప్‌టాప్‌లపై పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో వీటిని కొనుగోలు చేస్తే రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. వీటిపై 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు.