మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న తాజా చిత్రం భోళ శంకర్. ఈ సినిమా ను తమిళ సినిమా అయిన వేదాళం కు తెలుగు రీమేక్ గా రానుంది. ఈ సినిమా కు దర్శకుడిగా మెహర్ రమేష్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా లో మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుందన్న వార్త చాలా రోజుల నుంచి సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టింది. అయితే ఈ వార్త ను నిజం చేస్తు చిత్ర బృందం తమన్నా భోళ శంకర్ సినిమా లో నటిస్తుందని ప్రకటించారు.
అయితే ఈ సినిమా కు మిల్క్ బ్యూటీ తమన్నా భారీ గా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నారు. ఈ సినిమా కు తమన్నా ఏకంగా రూ. 3 కోట్ల లను పారితోషికంగా తీసుకుంటుందని టాక్. ఈ పారితోషికానికి ఈ సినిమా నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఇప్పటికే తమన్నా కు సగం పారితోషికం కూడా ఇచ్చారు అని టాక్. అయితే మిల్క్ బ్యూటీ తమన్నా క్రేజ్ రోజు రోజు కు పెరిగిపోతుంది. వరుస పెట్టి సినిమా లు తీస్తుంది. అలాగే భారీగా రెమ్యూనరేషన్ ను కూడా డిమాండ్ చేస్తుంది.