పాకిస్థాన్ మరోసారి తన వక్ర బుద్ధిని చూపింది. భారత విమానానికి తన గగనతలాన్ని వినియోగించుకునేందుకు నిరాకరించింది. గతంలో పలు సందర్భాల్లో భారత విమానాలకు తన ఎయిర్ స్పెస్ ను వినియోగించుకునేందుకు నో చెప్పింది. స్వయంగా ప్రధాన మంత్రి, రాష్ట్రపతి విదేశీ పర్యటన సందర్భంగా కూడా ఇటువంటి ఇబ్బందులనే కలిగించింది. జమ్మూ కాశ్మీర్ డెవలప్ మెంట్ లోభాగంగా ఇటీవల యూఏఈతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది పాకిస్థాన్ కు మింగుడు పడటం లేదు. తాజాగా యూఏఈ షార్జా నుంచి శ్రీనగర్ వరకు నేరుగా విమాన సర్వీసును భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే తమ గగనతలం నుంచి ఈ విమానానికి అనుమతిని నిరాకరించింది. ఈ విమానం అందుబాటులోకి వస్తే జమ్మూ కాశ్మీర్ ఉత్పత్తులను నేరుగా విదేశీ మార్కెట్ కు తరలించవచ్చు. జమ్మూ కాశ్మీర్ వాసులు నేరుగా మిడిల్ ఈస్ట్ ప్రాంతాన్ని చేరే వీలు కలుగుతుంది.
అయితే జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ పై అక్కసుతో పాకిస్థాన్ ఈ పనిచేసింది. దీంతో షార్జా- శ్రీనగర్ మధ్య నడిచే విమానం గుజరాత్ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 360, 35ఏ ఎత్తేసిన నుంచి పాక్ విమానాల ప్రయాణాలపై తన గగనతలాన్ని వినియోగించుకునేందుకు అడ్డంకులు కలిగిస్తూ వస్తోంది. అక్టోబర్ 23న కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్-షార్జాల మధ్య నేరుగా విమానసర్వీసులు ప్రారంభించారు.