అతిగా పంచదార తీసుకుంటే క్యాన్సర్ సమస్య వస్తుందా..?

-

చాలా మంది పంచదారను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలానే తియ్యగా ఏమైనా తినాలని క్రేవింగ్ వచ్చినప్పుడు కూడా పంచదారను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే అతిగా పంచదారను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రిఫైన్డ్ షుగర్ ని ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఎక్కువగా రిఫైన్డ్ షుగర్ ను తీసుకోవడం వల్ల డయాబెటిస్, గుండె సమస్యలు వంటివి వచ్చే అవకాశం ఉంది. అలానే ఒబిసిటీకి కూడా దారితీసే అవకాశం ఉంది. బ్రెడ్, పాస్తా, కేక్, కోలా, యోగర్ట్, ప్రోటీన్ బార్స్ మొదలైన ఆహార పదార్థాల ద్వారా రిఫైన్డ్ షుగర్ ఎక్కువగా మనం తీసుకుంటాము. అయితే ఇలా రిఫైన్డ్ షుగర్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా.? నిపుణులు ఈ విషయం గురించి ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అండ్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ యూఎస్ఏ చెప్పిన దాని ప్రకారం పంచదారని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా ఒబిసిటీకి దారితీస్తుందని చెప్పారు. అయితే షుగర్ ని రిఫైండ్ ఫార్మ్ లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్ సెల్స్ ని అది మల్టీప్లై త్వరగా చేసేస్తుంది. ఎక్కువ షుగర్ ను తీసుకోవడం వల్ల బాగా బరువు పెరిగి పోతూ ఉంటారు.

అలానే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, కొలెన్ క్యాన్సర్, పాంక్రియాస్, ఓవరి, కిడ్నీ, లివర్, బ్రెయిన్, గాల్ బ్లేడర్, సెంట్రల్ నెర్వస్ సిస్టం మొదలైనవి. పంచదారని సాఫ్ట్ డ్రింక్స్, జ్యూసులు, క్యాండీస్, ఐస్ క్రీమ్స్ వంటి వాటి ద్వారా ఎక్కువగా తీసుకుంటే డిఎన్ఏ డామేజ్ చేసే అవకాశం ఉంటుంది. రిఫైండ్ షుగర్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ఇండైరెక్ట్ గా వస్తుంది. అయితే దీని అర్థం మీరు షుగర్ ని ఎలిమినేట్ చేయాలి అని కాదు. కూరగాయలు, పండ్లు మొదలైన వాటి ద్వారా వచ్చే పదార్థాలు అవసరం. కానీ యాడెడ్ షుగర్ ని తీసుకోవడం వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని కట్ చేస్తే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version