ఒక నెలలో ఎక్కువసార్లు స్ఖలిస్తే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుందా?

-

హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం నెలలో 21సార్లు స్ఖలనం జరిగితే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. అదే ఆస్ట్రేలియన్ అధ్యయనం ప్రకారం వారానికి ఏడుసార్లు స్ఖలిస్తే ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని చెబుతున్నారు. ఐతే మరో స్టడీ ప్రకారం ఇది 50సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుగల పురుషులలో మాత్రమే అని అంటున్నారు. ఇలా తరచుగా స్ఖలనం జరగడం వల్ల ఎందుకు ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందనేది మాత్రం అర్థం కావట్లేదట.

మరో పరిశోధన ప్రకారం 20, 30వయస్సుల్లో ఉన్నవారు ఎక్కువ సార్లు స్ఖలనం జరపడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఐతే ఈ పరిశోధన స్వయం సంతృప్తి కారణంగానే ఎక్కువ రిస్క్ ఉంటుందని ఎక్కడా చెప్పలేదు. హార్వర్డ్ అధ్యయనం వయసు ప్రకారంగా రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పలేదు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ ఎక్కువ స్ఖలిస్తే రిస్క్ తగ్గుతుందని చెప్పింది. అలాగే ఆస్ట్రేలియన్ అధ్యయనం కుర్రాళ్ళలో స్ఖలనం తరచుగా ఉంటే రిస్క్ తగ్గుతుందని చెప్పింది.

అడ్వాన్స్ స్టేజిలో ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ని ఎజాక్యులేషన్ తగ్గించలేదు.

ప్రొస్టేట్ క్యాన్సర్ కి దారి తీసే కారణాలు

50సంవత్సరాల వయసు పెబడ్డ పురుషుల్లో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
జన్యుపరంగా వారసత్వంగా వచ్చే అవకాశం
ఊబకాయంతో బాధపడేవారిలో కనిపించే అవకాశం
శారీరక శ్రమ చాలా తక్కువగా ఉన్నప్పుడు
మాంసం ఎక్కువగా తినడం వల్ల
ఎక్కువ ఎత్తుగా ఉన్న పురుషుల్లో

రాకుండా ఉండాలంటే

మాంసం, పాల పదార్థాల కొవ్వులు, జంతువుల కొవ్వులు తగ్గించాలి.
మఈ ఆహారానికి కూరగాయలు, పండ్లు యాడ్ చేసుకోండి.
ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్న పురుషులు ఆస్పిరిన్ మందులని రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల ఈ ఇబ్బంది కొంచెం కొంచెంగా తగ్గే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version