రైతులు వ్యవసాయం పాటు పశుపోషణ కూడా మంచి ఆదాయాన్ని ఇస్తుంది..అందుకే మన దేశంలో పాల ఉత్పత్తి కూడా ఎక్కువే..అయితే పశువులకు మామూలు పశు గ్రాసాల తో పాటు చిలకడదుంపలను కూడా వాడటం పాల ఉత్పత్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.. ఎలా వాడితే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
చిలగడ దుంప పశుగ్రాసంలో మిగతా పశుగ్రాసాలతో పోలిస్తే అధిక మాంసకృత్తులు కల్గి ఉండి వాటి అరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా దీనిలో ఎలాంటి హానికారక పదార్ధాలు ఉండవు. ఈ చిలగడ దుంప పశుగ్రాసాన్ని తక్కువ పాల దిగుబడినిచ్చే పాడిపశువులకు దాణాకి బదులుగా అందించవచ్చు. ఇది చిన్నకారు రైతులకి ఉత్పత్తి ఖర్చును ఆదా చేయడంలో సహాయపడుతుంది.
వీటి తీగలను మాంసకృత్తులను ఇచ్చే వనరులుగా చెప్పుకోవచ్చు. వీటిలో 15 నుండి 30 శాతం ఘన పదార్థం ఉంటుంది. ప్రోటీన్ శాతము 3.02 నుండి 7.38 వరకు ఉంటుంది మరియు వీటి యొక్క అరుగుదల 65 శాతం వరకు ఉంటుంది. ప్రోటీన్ శాతం ఆకులతో పోలిస్తే కాండంలో తక్కువగా ఉంటుంది.ఈ తీగలలో ఇతర పప్పుజాతి పశుగ్రాసాలలో ఉండే హానికారక పదార్ధాలు ఉండవు.అందుకే వీటిని నిరభ్యంతరంగా పెట్టవచ్చు..
ఇందులో 30 శాతం పిండి పదార్థం ఉంటుంది. ప్రోటీన్ శాతము 3.02 నుండి 7.38 వరకు ఉంటుంది మరియు వీటి యొక్క అరుగుదల 65 శాతం వరకు ఉంటుంది. ప్రోటీన్ శాతం ఆకులతో పోలిస్తే కాండంలో తక్కువగా ఉంటుంది.ఈ తీగలలో ఇతర పప్పుజాతి పశుగ్రాసాలలో ఉండే హానికారక పదార్ధాలు ఉండవు.ఈ చిలగడ దుంప తీగలను తక్కువ పోషక విలువలు కల్గిన పశుగ్రాసంపై పెంచే పశువులకు ప్రొటీన్ సప్లిమెంట్‌గా అందించవచ్చు. దీనిని ఒక పశువుకు ఒక రోజుకు 30 నుండి 50 కిలోల వరకు ఇవ్వవచ్చును..గొర్రెలకు ఇవ్వడం వల్ల త్వరగా బరువును కూడా పెరుగుతాయి..వీటి మాంసం కూడా రుచిగా మారుతుంది.. ఇప్పటి నుంచి ఖర్చు తగ్గించుకోవాలని అనుకోనేవాళ్ళు ఈ దుంపలను వాడటం చాలా మంచిది..