భారతీయ సినిమాలపై ట్రంప్‌ ప్రశంసల జ‌ల్లు.. ఏమ‌న్నారంటే..?

-

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి సబర్మతీ ఆశ్రమం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా మెతెరా స్టేడియం చేరుకున్నారు. అక్కడ జరగుతున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ట్రంప్, మోదీ పాల్గొన్నారు. ఇందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ తో తమ బంధం మరింత బలోపేతం అవుతోందని అన్నారు. భారత సినిమాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారత సినిమాలను ప్రపంచ దేశాలు ఇష్టపడుతున్నాయని ఆయన అన్నారు. దీనికి షారూక్ నటించిన ‘దిల్‌వాలే దుల్హానియో లే జాయేంగే’ సినిమాను ప్రస్తావించారు.

ఆ మూవీని ప్రపంచం మొత్తం ఇష్టపడిందని ట్రంప్ పేర్కొన్నారు. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో భాగంగా భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. ఇండియాలోని అన్ని భాషల్లో సంవత్సరానికి దాదాపుగా 2వేల సినిమాలకు పైగా వస్తున్నాయని వెల్లడించారు. ఈ సినిమాలు మిగిలిన దేశాలతో భారత్‌ అనుబంధాలు పెరగడానికి కూడా కారణమవుతున్నాయని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ పెద్దపీట వేస్తుందని ట్రంప్ ప్రశంసలు కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news