డొనాల్డ్ ట్రంప్ నా బెస్ట్ ఫ్రెండే : కే.ఏ.పాల్

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. చివరి వరకు పోరాడి కమలా హారిస్ ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో కే.ఏ. పాల్  అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ట్రంప్ తనకు మంచి స్నేహితుడు అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ పేర్కొన్నారు.

అమెరికా 47వ అధ్యక్షుడిగా విజయం సాధించిన  డొనాల్డ్ ట్రంప్ నకు తన తరపున శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ తప్పకుండా కృషి చేయాలన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి ప్రపంచ శాంతి నెలకొల్పాలి. నేను క్రిస్టియన్ ను కాబట్టి ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తున్నాను. కానీ ప్రపంచ శాంతిని కోరుకునే వ్యక్తిగా పాలస్తీనా కు అండగా ఉంటానని పేర్కొన్నారు కే.ఏ.పాల్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version