నేనుంటే ఉక్రెయిన్‌పై దాడి జరిగేదే కాదు : డొనాల్డ్ ట్రంప్

-

తాను అధ్యక్షడిగా ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వచ్చేది కాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా జట్టుకడుతున్నాయని.. ఇదంతా బైడెన్ అసమర్థత వల్లేనని ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరూ అణు దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ అణు యుద్ధం తప్పదని హెచ్చరించారు. తన హయాంలో అణ్వస్త్రాలపై మాట్లాడేందుకే చాలా దేశాలు భయపడేవని, ఇప్పుడు అందరూ హెచ్చరిస్తున్నారని తెలిపారు.

‘’మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో లేదు. కరెన్సీ విలువ పడిపోతోంది. చైనాతో రష్యా, ఇరాన్‌తో సౌదీ అరేబియా జతకట్టాయి. చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా జట్టుకట్టి విధ్వంసకర ప్రయత్నాలు చేస్తున్నాయి. నేను అధ్యక్షుడిగా ఉంటే ఇవన్నీ జరిగేవి కావు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వచ్చేది కాదు’. అధికారంలో ఉన్న డెమోక్రాట్లు అమెరికా ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని, విఫల దేశంగా మార్చేస్తున్నారని విమర్శించారు. న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుని ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఈ లెఫ్టిస్ట్‌ భావజాలం ఉన్న ఉన్మాదులు ప్రయత్నిస్తున్నారు’ అని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version