టిక్ టాక్ కు ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. భారత్ లో నిషేధం తర్వాత అమెరికాలో కూడా బ్యాన్ ఏర్పడడంతో… ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోయింది టిక్ టాక్ సంస్థ. అయితే టిక్ టాక్ యాజమాన్యపు హక్కులు అమెరికాకు చెందిన సంస్థకు ఇస్తే తమ దేశంలో టిక్ టాక్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తాము అంటూ గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే మైక్రోసాఫ్ట్ టిక్ టాక్ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం అవ్వగా… మరో ఐటి దిగ్గజం ఒరాకిల్ రంగంలోకి దిగి చర్చలు మొదలు పెట్టింది.
అయితే ఇటీవలే టిక్ టాక్ ఒరాకిల్ సంస్థతో చేసుకున్న ఒప్పందం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. టిక్ టాక్ అమెరికా యాజమాన్యపు హక్కులను ప్రముఖ ఐటీ దిగ్గజం ఒరాకిల్ సొంతం చేసుకున్న విషయం తనకు తెలిసిందని… ఒప్పందంలో మెజారిటీ యాజమాన్యపు హక్కులు చైనా కు సంబంధించిన బైట్ డాన్స్ చేతిలో ఉంటాయి అనేది మాత్రం తనకు నచ్చలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ డీల్ ని ఓసారి పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాను అంటూ మీడియా ముందు తెలిపారు డోనాల్డ్ ట్రంప్