దీపావళి రోజు ఇలా చేస్తే ఐశ్వర్యాలు మీ సొంతం!

-

దీపావళి రోజు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. లక్ష్మీదేవి కోరిక వరాలు తక్షణమే ప్రసాధించే దైవం. లక్ష్మీదేవిని ప్రతిరోజూ ఆరాధిస్తే ధనధాన్యాలు చేకూరుతాయని విశ్వాసం. మరి దీపావళి రోజున పాటించవలసిన నియమనింబంధనలు తెలుసుకుందాం.. ఈ రోజున ఉదయం ఐదింటికి నిద్రలేచి స్నానమాచరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలానే గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజ గదిలో ముగ్గులు తీర్చిదిద్దాలి. ముఖ్యంగా దీపావళి రోజున తెలుపు రంగు బట్టలు ధరించడం ఆనవాయితీ.
తరువాత ఆకుపచ్చ రంగుతో గల లక్ష్మీదేవీ పటాన్ని లేదా వెండితో తయారుచేసిన లక్ష్మీదేవి ప్రతిమను పూజకు సిద్ధం చేయాలి.

పూజలకు ఎర్రని అంక్షతలు, ఎర్రని పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబీ పువ్వులతో అమ్మవారిని ఆరాధించాలి. నైవేద్యాంగా జామకాయలు, రవ్వలడ్డులు, కేసరి, అరిసెలు వంటి పిండిపదార్థాలు సమర్పించి లక్ష్మీదేవి అష్టకం స్తోత్రాలను పఠించాలి. అంతేకాకుండా శ్రీ సూక్తం, శ్రీ లక్ష్మీ సహస్రనామం, భాగవతం, కనకధారాస్తవం వంటి పారాయణ స్తోత్రాలతో అమ్మవారిని ఆరాధించాలి. అందులో ముఖ్యంగా భాగవతంలోని నరకాసురవధ ఆధ్యాయాన్ని పారాయణం చేయవలసి ఉంటుంది. ఈ రోజున కుంకుమ పూజ గావించిన స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని చెప్తున్నారు. అవకాశం ఉంటే దగ్గర్లోని లక్ష్మీదేవి దేవాలయాలను లేదా విష్ణు సంబంధ ఆలయాలను సందర్శించి ప్రదక్షణలు చేస్తే మంచి ఫలితాలు వుంటాయని పండితులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version