బ్యాంకుల ద్వారా రాజకీయ పార్టీలకు ముడుపులు: జైరాం రమేష్

-

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన వివరాలను ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. పొలిటికల్ పార్టీ లకి అందిన నిధులపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ విధానంలో బ్యాంకుల ద్వారా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అధికారికంగా లంచాలు స్వీకరించారని అసహనం వ్యక్తం చేసింది.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేసిన సమాచారంతో భారీ నగదును బీజేపీకి చేరిందని పేర్కొన్నారు. 38 కార్పొరేట్ సంస్థలు అధికార బీజేపీ కి ఎలక్టోరల్ బాండ్లను అందజేసిందని తెలిపారు. తర్వాత ఆ సంస్థలకు భారీ మొత్తంలో ప్రాజెక్టులు అందాయని అన్నారు. 179 ప్రభుత్వ కాంట్రాక్టులు, 3.8 లక్షల కోట్ల విలువ గల ప్రాజెక్టులు ఆ సంస్థలు పొందాయని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి సామాన్యుల కష్టాలు పట్టవని ,రైతుల పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరను కల్పించదు అని మండిపడ్డారు. కోట్ల రూపాయల లంచాన్ని లీగల్‌కు తీసుకుంటుంది, అందుకు ప్రతిగా రూ.లక్షల కోట్ల ప్రాజెక్టులను ఇస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news