గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హరితహారంలో భాగంగా నాటించిన కోనోకార్పస్ చెట్లను నరికివేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.అయితే, ఈ చెట్లు మిగతా మొక్కలన్నిటి కంటే అత్యధిక కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని.. అత్యధిక ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లు పరిశోధనలో తేలిందని ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, యోగి వేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ.ఏఆర్ రెడ్డి అన్నారు.
ఈ చెట్ల ఆకులు తింటే ఒంట్లో చక్కెర శాతం,గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని పరిశోధనల్లో తేలిందన్నారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కోనోకార్పస్ చెట్లను నరికితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ఆయన ప్రభుత్వానికి స్ఫష్టంచేశారు. కాగా, ఈ చెట్లు కార్బడైయాక్సెడ్ తీసుకుని మరల అదే విడుదల చేస్తుందని నిండు అసెంబ్లీలో స్పీకర్ చెప్పిన విషయం తెలిసిందే.