రెండో రోజు ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా హాజరు అయ్యారు. రాబర్ట్ వాద్రా వెంట ఈడీ ఆఫీసుకు ప్రియాంక గాంధీ వెళ్లారు. మనీలాండరింగ్ ఆరోపణలపై రాబర్ట్ వాద్రాను విచారించిన ఈడీ.. రాబర్ట్ వాద్రా కు నోటీసులు ఇచ్చింది. ఇక ఈ తరుణంలోనే రెండో రోజు ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా హాజరు అయ్యారు.

కాగా రేపు హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసనలు, ధర్నా జరుగనుంది. బీజేపీ, ప్రధాని మోదీ రాజకీయ కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏ ఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చార్జిషీటులో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందో ళనలు కొనసాగనున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలిరావాలని కాంగ్రెస్ నేతలు, కార్య కర్తల కు టీపీసీసీ పిలుపునిచ్చింది.