గెలవడంలో ఫెయిల్ అయినా పరవాలేదు.. కానీ ట్రై చెయ్యడంలో మాత్రం అవ్వద్దు..!

-

మనం ఏదైనా సాధించాలంటే మనం ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా భయపడకూడదు. కచ్చితంగా ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం లేకపోతే గెలవలేరు. ఎక్కువ శాతం మంది ప్రయత్నం చేయకుండా ఓటమిని ఎదుర్కోవాలని… ఓటమిపాలైపోతానేమో అని భయపడి కనీస ప్రయత్నం చేయరు. నిజానికి ఆ తప్పు ఎవరు ఎప్పుడు చేయొద్దు.

మనం మొదట ప్రయత్నం చేస్తేనే కదా గెలిచేది..? కాబట్టి ప్రయత్నం చేయడం చాలా అవసరం. ప్రయత్నం చేస్తేనే గెలవడం ఓడడం ఉండేది. ప్రయత్నం కనుక చేయకపోతే ఓ పక్క గెలవలేము మరో పక్క ఓడిపోలేము. గెలుపు ఓటమి సంగతి మొదట పక్కన పెట్టేసి పనిని చేయడానికి ప్రయత్నం చేయండి నిజానికి ప్రయత్నం అనేదే గెలుపు కి మొదటి మెట్టు. గెలుపు గురించి ఆలోచించకండి కేవలం ప్రయత్నించి చూడండి.

అంతేకానీ గెలుస్తామా ఓడిపోతామ అని ఏ మాత్రము మీరు భయపడకుండా మొదలు పెడితే మంచిది. కానీ చాలామంది రేపు ఏం చూడాలి..?, భవిష్యత్తు ఎలా ఉంటుంది..?, ఓటమిని ఎలా ఎదుర్కోవాలి అని ఎన్నో రకాల ఆలోచనలతో భయపడిపోయి వెనకడుగు వేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కనీసం ధైర్యం పెట్టి మొదలు పెడితే ఏదో ఒకటి అవుతుంది. ఇలా మీరు కాస్త ప్రయత్నంతో ముందుకు వెళ్తే గెలిచే అవకాశం ఉంది అలానే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవడం చాలా ముఖ్యం నమ్మకం తో మీరు ముందుకు వెళితే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలా మీరు ప్రయత్నం చేసేసి మంచిగా జీవితంలో సక్సెస్ అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news