అన్‌స్టాపబుల్‌ షోకు అనుకోని బ్రేక్.. ఈ వారం ఎపిసోడ్ లేనట్టే..!

-

వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా నందమూరి బాలకృష్ణ జోష్ డబుల్ స్పీడ్ తో సాగుతోంది. బాలయ్య బాబు హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షో సీజన్ 1 దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సీజన్ 1కి వచ్చిన రెస్పాన్స్ తో నిర్వాహకులు సీజన్ 2ను స్టార్ట్ చేశారు. సీజన్ 2 కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.

ఇప్పటి వరకు అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2లో రెండు ఎపిసోడ్స్ ముగిశాయి. తొలి ఎపిసోడ్‌లో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ గెస్టులుగా వచ్చారు. ఇక రెండో ఎపిసోడ్‌లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లు సందడి చేశారు. ఈ రెండు ఎపిసోడ్స్ తర్వాత మూడో ఎపిసోడ్ ఎవరితో చేయబోతున్నారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మూడో ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నిర్వాహకులు  బ్యాడ్ న్యూస్ చెప్పారు.  ప్రతి శుక్రవారం ప్రసారమవుతూ వచ్చిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 రేపు ప్రసారం కావటం లేదు. కొత్త ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం ఆహా యాజమాన్యం చంద్రబాబు – నారా లోకేశ్ ఎపిసోడ్‌ అన్ సెన్సార్డ్ వెర్షన్‌ను అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత అప్ లోడ్ చేయబోతున్నారట. అయితే ఈ బ్రేక్ రావటానికి కారణం.. NBK 107 షూటింగ్ కారణమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news