ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఓటములు వస్తూ ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఓటమి వచ్చినా బాధ వచ్చిన కృంగిపోతు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకూడదు. దాని నుండి బయటపడే మార్గాన్ని చూడాలి. ఎప్పుడు తప్పు చేసాము ఎక్కడ తప్పు చేశాము అనే విషయాలను గమనించాలి.
సాధారణంగా మన జీవితంలో ఏదైనా బాధ ఉన్నా ఏదైనా ఓటమి ఉన్నా మనం బాధపడుతూ ఉంటాము. కానీ నిజానికి దాని వల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడైనా సరే బాధ ఎదురయ్యింది అంటే దానికి గల కారణం గురించి తెలుసుకోవాలి. ఆ కారణాన్ని చూస్తే కచ్చితంగా మీరు ఎక్కడ పొరపాటు చేశారు… ఎవరు మిమ్మల్ని అడ్డుపడ్డారు అనే విషయాలని తెలుసుకుంటారు. ఇలా మీరు ధైర్యంగా ఆలోచిస్తే ఖచ్చితంగా మరోసారి గెలుపొందే అవకాశం ఉంటుంది.
అదే విధంగా మీరు ఎప్పుడైనా ఓటమి కానీ బాధని కానీ చూసారంటే మిమ్మల్ని దాని నుండి ఎవరు ఆపుతున్నారు ఎవరు నడిపిస్తున్నారు అనేవి కూడా తెలుస్తాయి. ఎవరైనా వెనక్కి లాగుతూ ఉంటే వారికి దూరంగా ఉండడం మంచిది. కొందరు బయటకు కనపడరు కానీ అడ్డుకుంటారు అటువంటి వాళ్లని దూరం పెట్టేసి మీరు ముందుకు వెళితే మరొకసారి మీకు ఫెయిల్యూర్ రాదు.
అలానే మీరు బాధపడుతున్నప్పుడు చుట్టూ ఉండే విషయాలను గమనించడం చాలా ముఖ్యం. ధైర్యంగా మీరు సమస్య ఎదుర్కొని మరొకసారి గెలవడానికి చూడాలి. ఎప్పుడూ కూడా సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఓపికతో భరించాలి. తట్టుకుంటూ ఉండాలి. కచ్చితంగా అప్పుడు మీకు అందమైన జీవితం ఉంటుంది. ఇలా మీరు ఒకసారి అనుసరిస్తే అలవాటైపోతుంది.
స్వామి వివేకానంద చెప్పినట్లు కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు.. పడినా లేస్తున్నందుకు అనే దానిని మీరు కూడా నిదర్శంగా తీసుకోవాలి.