తెలంగాణ తల్లికి నగలొద్దు.. సీఎం రేవంత్ కుటుంబ సభ్యులకు కావాలా? : పల్లా రాజేశ్వర్ రెడ్డి

-

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు పున: ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే శానసమండలిలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నాడు బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన తెలంగాణ తల్లి రూపాన్ని మళ్లీ సవరించారు.

తెలంగాణ తల్లి సామాన్యంగా ఉండాలని చెప్పే సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు మాత్రం నిండుగా నగలు వేసుకొని ఉంటారని ఆరోపించారు.కానీ, వాళ్లకు తెలంగాణ తల్లి మాత్రం సామాన్యంగా ఉండాలని అంటున్నారు. తెలంగాణ తల్లి నుండి బతుకమ్మను వేరు చేయడం అంటే, తెలంగాణ బతుకును అవమానించినట్టే అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news