ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా మనకు ఎన్నో విషయాలను చెప్పారు. వీటిని కనుక తెలుసుకుంటే మన జీవితంలో ఎటువంటి సమస్యనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. నిజానికి చాలా మంది వివిధ రకాల తప్పులను చేస్తూ ఉంటారు వీటి వలన జీవితంలో అనేక సమస్యలు కలుగుతాయి. ఆచార్య చాణక్య ఈ పొరపాటును అసలు చెయ్యద్దు అని అంటున్నారు. మరి ఎటువంటి పొరపాట్లు మన జీవితంలో చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.
కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు:
ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వచ్చినా ఎవరికీ చెప్పకూడదు వీటిని ఎవరికైనా చెప్పడం వలన మీకే నష్టం తప్ప ఫలితం ఉండదు అని అంటున్నారు. కాబట్టి ఇంటి విషయాలను ఇంటి గుట్టు బయట పెట్టుకోకండి.
మీ జీవితానికి సంబంధించిన విషయాలు:
మీ జీవితానికి సంబంధించిన విషయాలు ఎవరికి అయినా సరే చెప్పేముందు పది సార్లు ఆలోచించండి. కరెక్ట్ అనిపిస్తే చెప్పండి తప్ప లేకపోతే చెప్పద్దు.
దానం చేయడం:
మీరు దానం చేసిన వాటిని ఎవరికీ చెప్పకూడదు మీరు చేసే దానం గురించి ఇతరులకు చెప్పడం వలన మీరే నవ్వులపాలు అవుతారు.
శారీరక సంబంధం:
ఎప్పుడు కూడా ఏ వ్యక్తి శారీరక సంబంధం గురించి బయట చెప్పుకోరు ఇలా చెప్పుకుంటే మీరే నవ్వులపాలవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి తప్పులను అసలు జీవితంలో చేయకండి దీని వలన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.