అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమ దృశ్యాలు

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని శంకుస్థాపన సమయంలో… ప్రారంభించే కార్యక్రమం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం అమరావతిలో హాట్ టాపిక్ గా నిలిచింది. సీనియర్ ఎన్టీఆర్ ఓ నాగలి పట్టుకొని నిలుచున్న విగ్రహాన్ని తయారు చేయించింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.

Scenes from the groundbreaking ceremony of Amaravati capital

అలాగే తెలుగుదేశం పార్టీకి గుర్తుగా.. ఆయన పక్కనే ఓ సైకిల్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే నరేంద్ర మోడీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలుగులో అమరావతి… అనే పేరును… లిఖించిన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ మరి కాసేపట్లో రానున్నారు. ఈ సందర్భంగా దాదాపు 50 వేల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news