దసరా పండుగను పురస్కరించుకుని భారతదేశంలోని భారతీయులు అందరూ కూడా దుర్గామాతను ఎంతో భక్తిశ్రద్ధలతి, నియమ నిష్టలతో పూజిస్తూ ఉంటారు. చాలా చోట్ల ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు చాలా మందిలో ఒక సందేహం ఉందని తెలుస్తోంది. మాములుగా అయితే దసరా రోజున కొందరు నాన్ వెజ్ ను భుజిస్తారు అదే విధంగా మరికొందరు భుజించడానికి ఇష్టపడరు. కానీ దశమి రోజున మాత్రం నాన్ వెజ్ తినొచ్చు అని.. అందులో ఎటువంటి తప్పు లేదని పండితులు చెబుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని నియమాలను పాటించి ఆ తర్వాత నం వెజ్ తినొచ్చని తెలుస్తోంది. ఉదయాన్నే స్నానం చేసుకుని అమ్మవారి దర్శనం మరియు పూజను ఎంతో నియమ నిష్ఠలతో పూర్తి చేసుకుని ఆ తర్వాత నాన్ వెజ్ ను వాడుకుని తినాలని అంటున్నారు.
అయితే చిత్తం ఒకవైపు మరియు మనసు మరో వైపు లేకుండా చేసుకోవాలంటూ ఆధ్యాత్మికులు భక్తులకు సూచిస్తున్నారు. మరి మీలోనూ ఈ రోజు నాన్ వెజ్ తినాలా వద్దా అన్న సందేహం ఉంటే వెంటనే తీరిచేసుకోండి.