దేశ భాషలందు తెలుగు లెస్స. దేశంలోని అన్ని భాషలకన్నా తెలుగు శ్రేష్టమైనది : ద్రౌపది ముర్ము

-

ప్రేమకు భాష అడ్డంకి కాకూడదని.. అందుకే తాను హిందీలో మాట్లాడుతున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ ముర్ము తెలుగులో మాట్లాడారు. మీ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు. వేంకటేశ్వరస్వామి కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. అంతకుముందు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పౌర సన్మానం చేశారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా.. రాష్ట్రపతిని సన్మానించారు. ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టులో ద్రౌపదీ ముర్ము పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

తెలుగు భాష, సాహిత్యం గురించి దేశ ప్రజలందరికీ తెలుసు. దేశ భాషలందు తెలుగు లెస్స. దేశంలోని అన్ని భాషలకన్నా తెలుగు శ్రేష్టమైనది. ఇందులో భారతీయ భాషల ఔన్నత్యం తెలుస్తోంది. కవిత్రయం…. నన్నయ, తిక్కన, ఎర్రన్న భారతీయ భాషల గొప్పదనానికి ప్రతీక. భారతీయ భాషల గొప్పదనం కాపాడే దిశగా జాతీయ విద్యా విధానం 2020 రూపొందించారు. ఐటీ, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారత ప్రతిష్ఠను పెంచారు. ఆంధ్ర ప్రదేశ్‌ వాసులు భారత ప్రగతిలో అసాధారణ భాగస్వామ్యం పంచుకుంటారని విశ్వసిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లోని సోదరసోదరీమణులు, పిల్లందరిది బంగారు భవిష్యత్‌ కావాలని కోరుకుంటున్నా. భారత వికాసంలో ఆంధ్రప్రదేశ్‌.. భాగస్వామ్యం పెద్దఎత్తున ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అన్నారు ద్రౌపది ముర్ము.

Read more RELATED
Recommended to you

Exit mobile version