మీరు చెప్పిన మాటకు కట్టుబడైనా సరే తెలంగాణకు వాటాకు ఎంత ఇస్తరు : సీఎం కేసీఆర్‌

-

సీఎం కేసీఆర్‌ నేడు మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.55 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ .. కృష్ణా నదిలో మా వాటా తేల్చండి. మీరే వచ్చి చెప్పారు సభలు పెట్టి. మీరు చెప్పిన మాటకు కట్టుబడైనా సరే తెలంగాణకు వాటాకు ఎంత ఇస్తరు చెప్పమంటే.. అద్భుతమైన ప్రచారాలు చేసుకునే ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిదేళ్ల టైం చాలదా? అని ఆయన వ్యాఖ్యానించారు. ఎక్కడున్నదీ ఈ దేశం. వాటాచెప్పేందుకే ఎనిమిదేళ్లయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి? ప్రాజెక్టు ఎప్పుడు కట్టాలి? నీళ్లు ఎప్పుడు రావాలి? అని ఆయన మండిపడ్డారు. మనుమలా.. మునిమమల్లా..? లేకపోతే రానేరాదా? ఇంట్లనే ఉండాలా భారతదేశం? మన కండ్ల ముందు మన పాలమూరులో ఈ పరిస్థితి ఉందని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నరు. మాకు చేత కాదు. వ్యవహరం చేయరాదు.

నువ్వు చేస్తే నీకు అడ్డం పడుతమ్‌. నీ కాళ్లల్లో కట్టె పెడుతమన్నారు సీఎం కేసీఆర్‌. ఇదే జరుగుతుంది కదా? ఇంకా విచిత్రమైన పద్ధతులు. ప్రజాస్వామ్యంలో, ప్రజలు స్వామికులుగా ఉండే దేశంలో ఎవరికి అధికారం ఇస్తే వాళ్లు పని చేయాలి. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. గెలిచిన వారిని ఐదేళ్లు పని చేయనివ్వాలి. మంచో చేడో తేలుతుంది. ప్రజాకోర్టులో ప్రజలు నిర్ణయం తీసుకుంటరు. మాకు చేతకాదు. చేసేటోళ్లను చేయనివ్వం. ఎవరైతే చేస్తరో వారిని చేయనివ్వం. మా దొంగతనం బయటపడుతది. మా తెలివితక్కువ తనం బయటపడుతుంది. మా డొల్లతనం బయటుపడుతుంది.. ఇది కదా ఇవాళ ఈ దేశంలో జరిగేది. ‘మీ చెవుల నిండా వింటున్నరు. కండ్ల నిండా టీవీల్లో చూస్తున్నరు. నేను చెప్పేది చిన్న విషయం కాదు. ఆ నాడు తెలంగాణ విషయంలో నేను చెప్పిన ప్రతిమాటా నిజమైంది అన్నారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version